iDreamPost

రాజ్ భవన్ లో కరోనా కలకలం- గవర్నర్ కు కరోనా పరీక్షలు

రాజ్ భవన్ లో కరోనా కలకలం- గవర్నర్ కు కరోనా పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి క్రమంగా పెరుగుతుంది.. తాజాగా రాజ్ భవన్ లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా సోకినట్లు తేలడంతో ఒక్కసారిగా రాజ్ భవన్ లో కలకలం మొదలైంది. దీంతో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా వైరస్ పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా విధులను నిర్వహిస్తున్న ఓ వ్యక్తితో పాటు, మెడికల్ స్టాఫ్
‌లో ఓ నర్సుకు, ఓ బట్లర్, హౌస్ కీపింగ్ స్టాఫ్ కు కూడా వైరస్ సోకింది. కాగా కరోనా వైరస్ సోకిన ఉద్యోగులకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని, బయటకు వెళ్లలేదని అధికారులు స్పష్టం చేశారు. వారికి కరోనా ఎలా సోకింది అనే దానిని గుర్తించేపనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.

దాంతోపాటు రాజ్ భవన్ లో పనిచేస్తున్న అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి క్వారెంటయిన్ చేయనున్నారు. విజయవాడలో కరోనా కేసులు ఎక్కువగా నమోడవుతున్నాయి. కృష్ణా జిల్లాలో నమోదయిన 177 కేసుల్లో 150 కేసులు ఒక్క విజయవాడలో నమోదవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. రాజ్ భవన్ లో కరోనా పాజిటివ్ కేసులు గవర్నర్ తో పాటుగా రాజ్ భవన్ లో పనిచేస్తున్న అందరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1177కి చేరగా,వైరస్ కారణంగా 31 మంది మృతిచెందారు. 232 మంది వైరస్ బారినుండి కోలుకున్నారు. గడిచిన 24గంటల్లో 6517 శాంపిల్స్‌ను పరీక్షించగా కొత్తగా మరో 80 కేసులు నమోదయ్యాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి