iDreamPost

కనిపించని శత్రువు కబలిస్తోంది.. ఏపీ లో మరో ఇద్దరు మృతి

కనిపించని శత్రువు కబలిస్తోంది.. ఏపీ లో మరో ఇద్దరు మృతి

కనిపించని శత్రువు కరోనా వైరస్ కబలిస్తోంది. అమాయకుల ప్రాణాలను తీస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు గురువారం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ఈ మరణాలు నమోదయ్యాయి. దింతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య ఆరుకి చేరింది.

ఇక ఏపీలో ఈ రోజు 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఈ ఒక్క రోజే 11 కొత్త కేసులు నమోదయ్యాయి. దింతో ఆ జిల్లాలో కేసుల సంఖ్య 38కి చేరింది. గుంటూరు లో రెండు, కడప, తూర్పు గోదావరి జిల్లాలో ఒక్కొక్క కేసు చొప్పున ఈ రోజు నమోదయ్యాయి. మొత్తంగా ఏపీలో కరోనా సోకినా వారి సంఖ్య 363కి పెరిగింది. ఇందులో 6 మంది చనిపోగా 10 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి వారి ఇళ్లకు వెళ్లారు. వీరిలో ఒకరు ఈ రోజు చిత్తూరు జిల్లా తిరుపతి లో కోలుకున్న యువకుడు ఉన్నారు.

జిల్లాల వారిగా చూస్తే.. 75 కేసులతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. అనంతపురం లో 13, చిత్తూరు జిల్లా లో 20, తూర్పుగోదావరి లో 12, పశ్చిమ గోదావరి లో 22, గుంటూరులో 51, కడపజిల్లా లో 29, కృష్ణా లో 35, నెల్లూరు జిల్లా లో 48, విశాఖలో 20 కేసులు చొప్పున ఇప్పటి వరకు నమోదయ్యాయి. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు కరోనా సోకని జిల్లాలుగా విజయనగరం, శ్రీకాకుళం నిలవడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి