iDreamPost

తిరుమ‌ల వెంక‌న్న‌కి క‌రోనా దెబ్బ‌

తిరుమ‌ల వెంక‌న్న‌కి క‌రోనా దెబ్బ‌

క‌రోనా మ‌నుషుల్నే కాదు, దేవున్ని కూడా దెబ్బ కొడుతోంది. భ‌క్తులు తుమ్మినా, ద‌గ్గినా దేవుడు కూడా మాస్క్ వేసుకోవాల్సిన స్థితి. తిరుమ‌ల‌లో వెంక‌న్న‌ని ద‌ర్శించుకోడానికి కూడా భ‌క్తులు భ‌య‌ప‌డుతున్నారు. గ‌త వారంతో పోలిస్తే భ‌క్తుల సంఖ్య స‌గానికి త‌గ్గిపోయింది. వీఐపీ కోటాలో రోజుకి 3 వేల టికెట్లు ఇచ్చేవాళ్లు. ఆ సంఖ్య ఇప్పుడు 2వేల లోపే. ఆన్‌లైన్ బుకింగ్స్ 50 శాతం ప‌డిపోయాయి. సిఫార్సుల కోసం కిట‌కిట‌లాడే జేఈఓ కార్యాల‌యంలో సంద‌డి త‌గ్గింది. TTD చ‌రిత్ర‌లోనే మొద‌టిసారిగా 20 శాతానికి పైగా కాన్సిలేష‌న్లు (కాటేజీ, గెస్ట్‌హౌస్‌లు) జ‌రుగుతున్నాయి. క‌రోనా నివార‌ణ‌కి TTD ఎన్నిచ‌ర్య‌లు తీసుకుంటున్నా భ‌క్తులు భ‌య‌ప‌డుతున్నారు.

మ‌రోవైపు నెల్లూరులో భ‌యం వ్యాపించింది. క‌రోనా సోకిన వ్య‌క్తి ఉంటున్న చిన్న‌బ‌జారు ఖాళీ అయిపోయింది. జ‌నం బంధువుల ఇళ్ల‌కి వెళ్లిపోతున్నారు. ఓట్లు అడ‌గ‌టానికి నాయ‌కులు కూడా రావ‌డం లేదు.

సెలూన్ల‌ని , బ్యూటీపార్ల‌ర్ల‌ని క‌రోనా చావు దెబ్బ కొట్టింది. జ‌నం రావ‌డం లేదు. వ‌చ్చినా ఒకరు వాడిన క్లాత్‌ని ఒంటిమీద క‌ప్పుకోడానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు. ఇస్త్రీ క్లాత్ కావాల‌ని డిమాండ్ చేస్తున్నారు. చేతులు శుభ్రంగా క‌డుక్కొని Work ప్రారంభించ‌మ‌ని అడుగుతున్నారు.

ఈ భ‌యం అన్ని రాష్ట్రాల‌కి పాకుతూ ఉంది. అయితే పూర్తిగా టూరిజం మీద అధార‌ప‌డిన గోవా పూర్తిగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేలా ఉంది. ఇప్ప‌టికే టూరిస్టులు త‌గ్గిపోయారు. వాళ్ల‌ని ఆక‌ర్షించ‌డానికి ఏర్పాటు చేసిన అనేక ఫెస్టివ‌ల్స్ కాన్సిల్ అవుతున్నాయి. ఇంకో వైపు కాసినోల‌ని ప్ర‌భుత్వం తీవ్రంగా హెచ్చ‌రించింది. క‌రోనా నివార‌ణ‌కి త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే మూసేస్తామ‌ని నోటీసులు ఇచ్చింది.

అయితే మ‌న దేశ ప్ర‌జ‌ల‌కి ఇమ్యూనిటీ ఎక్కువ‌. అనేక క‌ష్ట‌మైన ప‌రిస్థితుల్లో మ‌నుగ‌డ సాగించ‌డం వ‌ల్ల మ‌న జీన్స్‌లోనే రెసిస్టెన్స్ ప‌వ‌ర్ ఉంది. సోష‌ల్ మీడియా, టీవీలు, పేప‌ర్ల వ‌ల్ల గంగ‌వెర్రులెత్తాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే గ‌తంలో ఎన్నో వైర‌స్‌లు ప్ర‌పంచాన్ని దాడి చేసిన‌ప్పుడు కూడా మ‌న‌దేశంలో మ‌ర‌ణాల సంఖ్య చాలా త‌క్కువ.

1957లో ఆసియ‌న్ ఫ్లూ వ‌చ్చిన‌ప్పుడు ఇత‌ర దేశాల్లో ల‌క్ష‌ల మంది చ‌నిపోతే మ‌న‌దేశంలో మ‌ర‌ణాలు 1098 (44 ల‌క్ష‌ల వ్యాధిగ్ర‌స్తులు). 1968లో హంగ్‌కాంగ్ ఫ్లూ వ‌స్తే అమెరికాలో 33,800 మంది చ‌నిపోతే, మ‌న దేశంలో ఆ సంఖ్య 100 లోపే. 2009లో స్వైన్‌ఫ్లూ వ‌చ్చి ఒక్క అమెరికాలోనే 1.20 ల‌క్ష‌ల మంది చ‌నిపోయారు. మ‌న దేశంలో 2వేల మంది చ‌నిపోయారు. జీన్స్ ప‌రంగా మ‌నం గ‌ట్టివాళ్లం. మ‌ర‌ణం కూడా మ‌న‌ల్ని చూసి భ‌య‌ప‌డుతుంది. ఇక క‌రోనా ఎంత‌?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి