iDreamPost

కరోనా ఎఫెక్ట్ – తెలుగు రాష్ట్రాల అప్రమత్తం

కరోనా ఎఫెక్ట్ – తెలుగు రాష్ట్రాల అప్రమత్తం

చైనాలో పుట్టి అక్కడ ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేసిన కరోనా(కొవిడ్ 19) ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణుకుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా 90,932 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ సోకిన వారిలో విషమంగా ఉన్న వారి సంఖ్య 7098 కాగా, కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా 3,119 మంది మృతిచెందారు. మృతుల్లో ఒక్క చైనాలోనే 2,994 మంది మృతి చెందడం ఆ దేశంలో కరోనా తీవ్రతను సూచిస్తుంది. కరోనా వల్ల చైనాలో ప్రజా జీవనం స్తంభించిన విషయం తెలిసిందే..చైనా మినహా మిగిలిన ప్రపంచ దేశాల్లో ఇరాన్ లో 66 మంది, ఇటలీలో 52 , దక్షిణ కొరియాలో 28 మృతి చెందారు..ఇప్పుడు ప్రపంచ దేశాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందటం ఆయా దేశాల్ని కలవర పెడుతుంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా కలకలం మొదలైంది. కరోనా ఉందన్న అనుమానంతో గాంధీ హాస్పిటల్ లో చేరిన 8 మంది చేరారు.తాజాగా కరోనా వైరస్ సోకిన వ్యక్తికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ లో కరోనా కేసు బయటపడటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.దీంతో తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ ప్రారంభించి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరుపుతున్నారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి 8 శాఖల అధికారులతో కేబినెట్ సబ్ కమిటీ సమీక్షించనుంది. కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర రావు హాజరయ్యారు. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ ప్రజలకు సూచించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరోనా వస్తే మరణం వచ్చినట్లు కాదని కేటీఆర్ వివరించారు.

మహేంద్ర హిల్స్ లో కరోనా భయంతో వీధుల్లోకి ఎవరూ అడుగుపెట్టే సాహసం చేయడంలేదు. కాగా మహేంద్ర హిల్స్ వీధులన్నీ ముందు జాగ్రత్తగా శుభ్రం చేస్తూ, GHMC తరపున యాంటీ వైరస్ ను వీధులలో పిచికారీ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని కరోనా వైరస్ గురించి అప్రమత్తంగా ఉండాలని అధికారులనుఆదేశించారు.. ఫోన్ లో అధికారులతో కరోనా వైరస్ గురించి సమీక్షించిన ఆళ్ల నాని అధికారులను అప్రమత్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి