iDreamPost

సిఆర్పిఎఫ్ లో కరోనా కలకలం

సిఆర్పిఎఫ్ లో కరోనా కలకలం

సిఆర్పిఎఫ్ లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. జవాన్ల లో రోజురోజుకీ వైరస్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. తూర్పు ఢిల్లీ బెటాలియన్ లో తాజాగా ఈ రోజు 68 మందికి కరోనా వైరస్ సోకిందని నిర్ధారణ అయింది. ఇంకా మరో వంద మంది కి సంబంధించిన పరీక్ష ఫలితాలు రావాల్సి ఉండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.

ఇప్పటికే 126 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇందులో ఒక తూర్పు ఢిల్లీ బెటాలియన్ లొనే124 మంది ఉండడం గమనార్హం. వైరస్ సోకిన జవాన్ల లో ఇప్పటివరకు ఒకరు కోలుకోగా.. మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారికి చికిత్స జరుగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిన్న శుక్రవారం ఒక్క రోజే 223 మందికి ఈ వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 4 వేలకు చేరువలో ఉంది. ఇప్పటి వరకు పదకొండు వందల మంది కోలుకున్నారు. ఎక్కువ మంది పరీక్షలు నిర్వహిస్తుండడంతో నే కొత్త కేసులు నమోదవుతున్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెబుతున్నారు. ప్లాస్మా థెరపీ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. కోలుకున్న 1100 మంది తమ ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి