iDreamPost

ఇల్లు కొనాలనుకునేవారు త్వరపడండి.. జనవరి 1 తర్వాత పెరగనున్న ధరలు

  • Published Dec 30, 2023 | 4:39 PMUpdated Dec 30, 2023 | 4:48 PM

సొంతిల్లు కొనాలని భావించి ఆగిపోయారా.. అలాంటి వారు త్వరపకపోతే భారీగా నష్టపోతారని అంటున్నారు రియల్ ఎస్టేట్ రంగం నిపుణులు. ఆ వివరాలు..

సొంతిల్లు కొనాలని భావించి ఆగిపోయారా.. అలాంటి వారు త్వరపకపోతే భారీగా నష్టపోతారని అంటున్నారు రియల్ ఎస్టేట్ రంగం నిపుణులు. ఆ వివరాలు..

  • Published Dec 30, 2023 | 4:39 PMUpdated Dec 30, 2023 | 4:48 PM
ఇల్లు కొనాలనుకునేవారు త్వరపడండి.. జనవరి 1 తర్వాత పెరగనున్న ధరలు

సామాన్యులు మొదలు కోటీశ్వరుల వరకు ప్రతి ఒక్కరికి ఉండే అతి ముఖ్యమైన కోరిక.. సొంతిల్లు. తాము చనిపోయే లోపు చిన్నదో.. పెద్దదో తమ కంటూ సొంతమైన ఓ ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరు కలలు కంటారు. కానీ నేటి కాలంలో ఇంటి నిర్మాణం అంటే అంత ఈజీ కాదు. భూమి దగ్గర నుంచి ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇసుక ఇలా అన్నింటి ధరలు విపరీతంగా పెరిగాయి. గ్రామాల్లోనే ఇంటి నిర్మాణానికి ఏకంగా 15-20 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇక పట్టణాల్లో అయితే ఈ ఖర్చు డబుల్ అవుతుంది. ఈ క్రమంలో ఇల్లు కొనాలనుకునేవారు.. ఇప్పుడే కొంటే మంచిదని.. లేదంటే జనవరి 1 తర్వాత వీటి ధరలు భారీగా పెరగనున్నాయి అంటున్నారు నిపుణులు.

జనవరి 1 నుంచి పలు సంస్థలు.. చదరపు అడుగు ధరలను సవరించబోతున్నాయని సమాచారం. అంతేకాక ఇంటి స్థలాలపై ఇస్తున్న రాయితీలు ముగుస్తాయని.. కనుకు ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారు.. ఈలోపే బుక్‌ చేసుకోవాలని స్థిరాస్తి సంస్థలు కోరుతున్నాయి. నచ్చిన ఇల్లు దొరక్క, ఒకవేళ నచ్చినా..  బడ్జెట్‌ సరిపోక చాలా మంది ఇంటి కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేస్తుంటారు. అయితే కొనుగోలు ఆలస్యమయ్యేకొద్దీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. తప్ప దిగి రావడం లేదు.

ఏకంగా 24 శాతం దాకా పెరుగుదల..

దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే.. మన దగ్గర మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఇళ్ల ధరల పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. గత ఏడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం మన దగ్గర ఇళ్ల ధరల్లో 24 శాతం పెరుగుదల నమోదైంది అంటున్నారు స్థిరాస్తి రంగ నిపుణులు. అయితే ఇళ్ల ధరలు ఇంతలా పెరగానికి కారణం.. భూముల రేటు అని.. అది పెరగడం వల్లనే ఇంటి ధరలు పెరుగుతున్నాయి అంటున్నారు.

నగరంలో పెరుగుతున్న నిర్మాణాలు..

గతంతో పోలిస్తే ఇటీవల సంవత్సరాల్లో హైదరాబాద్ లో.. వార్షికంగా నిర్మాణం పూర్తిచేసుకుంటున్న యూనిట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది అంటున్నారు. 2022లో 68,010 యూనిట్ల సరఫరా ఉంటే..  ఈఏడాది అది 76,345కి పెరిగిందని.. అటే 12 శాతం వృద్ధి నమోదైంది అంటున్నారు. అంతేకాక వీటిల్లో.. రూ.40 లక్షలు మొదలు రూ.రెండున్నర కోట్ల వరకు ఉన్న గృహాల వాటానే అధికంగా అనగా సుమారు 82 శాతంగా ఉందని తెలిపారు.

ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తాజా నివేదిక ప్రకారం లగ్జరీ ఇళ్ల విక్రయాలు హైదరాబాద్‌లో భారీగా పెరిగాయి అని తెలిపింది. ఈ జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో మన హైదరాబాద్‌లో లగ్జరీ ఇళ్ల విక్రయాలు గతేడాదితో పోలిస్తే ఏకంగా 26 శాతం మేర పెరిగాయట. 2022లో ఏడాదిలో 3,790 ఇళ్లు అమ్ముడయితే.. 2023లో అది 13,630కి చేరింది. అంటే 26 శాతం ఇళ్ల విక్రయాలు పెరిగినట్లు నివేదిక వెళ్లడించింది. ఇక తెలంగాణ రాజధాని ప్రాంతంలో అనగా హైదరాబాద్ లో ఈ 9 నెలల కాలంలో మొత్తం 44,200 ఇళ్ల విక్రాయలు జరిగితే అందులో 31 శాతం మేర లగ్జరీ ఇళ్లే ఉండడం గమనార్హం. దీన్ని బట్టీ నగరంలో లగ్జరీ ఇళ్లకు ఉన్న డిమాండ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి