iDreamPost

రాజకీయాల్లోకి రాహుల్ సిప్లిగంజ్? పోటీ అక్కడి నుంచేనా?

  • Author singhj Published - 12:41 PM, Sat - 5 August 23
  • Author singhj Published - 12:41 PM, Sat - 5 August 23
రాజకీయాల్లోకి రాహుల్ సిప్లిగంజ్? పోటీ అక్కడి నుంచేనా?

టాలీవుడ్ పాపులర్ సింగర్స్​లో రాహుల్ సిప్లిగంజ్ ఒకరు. ఆయన పేరు తెలియని తెలుగు సంగీత ప్రియులు ఉండరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. యూట్యూబ్ వీడియోలు చేస్తూ.. చిన్నగా ప్రచారం పొందుతూ ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నారు రాహుల్. ధూల్​పేట్​లో పుట్టిన ఆయన ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ వేదికపై పాడే స్థాయికి ఎదిగారు. యూట్యూబ్ వీడియోల నుంచి మొదలైన ఆయన ప్రస్థానం.. ఆ తర్వాత సినిమా పాటలు పాడటం, బిగ్​బాస్​ టైటిల్ విన్నర్​గా నిలవడం, ఆస్కార్స్​లో పాడటం వరకు ఓ కలలా సాగిందనే చెప్పాలి. ఒక్కో పాటతో తన పాపులారిటీని పెంచుకుంటూ వచ్చారు రాహుల్ సిప్లిగంజ్​.

‘ఆర్ఆర్ఆర్’ మూవీలో మరో సింగర్ కాలభైరవతో కలసి పాడిన ‘నాటు నాటు’ పాట రాహుల్ సిప్లిగంజ్ లైఫ్​ను మార్చేసింది. ఈ సాంగ్​తో ఆయన తన ఫ్యాన్​బేస్​ను మరింతగా పెంచుకున్నారు. అలాంటి రాహుల్ త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని టాక్. ఈ ఏడాది ఆఖర్లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి రాహుల్​ను పోటీలో నిలపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. రాహుల్​ ఉండే మంగళ్​హాట్ ప్రాంతం గోషామహల్​ నియోజకవర్గంలోనే ఉంది. ఈ నేపథ్యంలో లోకల్ బాయ్​ అయిన రాహుల్ సిప్లిగంజ్​ను తమ పార్టీ నుంచి గోషామహల్​లో బరిలో ఉంచితే.. బలమైన అభ్యర్థిగా నిలుస్తాడని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోందని సమాచారం. ఈమధ్య కాలంలో ఈ స్టార్ సింగర్ గోషామహల్​లో ఎక్కువగా తిరుగుతుండటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది.

రీసెంట్​గా బోనాల పండుగ టైమ్​లో కూడా రాహుల్ సిప్లిగంజ్ పెద్ద ఎత్తున గోషామహల్ గల్లీల్లో దావత్​లకు అటెండ్ అయినట్లుగా వినికిడి. యూత్, మాస్​లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయనతో గోషామహల్ నుంచి పోటీ చేయిస్తే గెలవొచ్చని కాంగ్రెస్ అనుకుంటోందని గాసిప్స్ వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఇప్పటికే రాహుల్​కు పలువురు కాంగ్రెస్ పెద్దలు చెప్పడంతో.. ఆయన కూడా స్థానికులతో మాట్లాడిన తర్వాత తన నిర్ణయం చెబుతానని అన్నట్లు సమాచారం. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది రాహుల్ సిప్లిగంజ్​కే తెలియాలి. మరి.. రాహుల్ సిప్లిగంజ్ పాలిటిక్స్​లోకి ఎంట్రీ ఇవ్వాలని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి