iDreamPost

MP కూతురుని బయపెట్టిన యానిమల్.. ఆ సీన్స్ చూసి ఏడ్చుకుంటూ బయటకు

పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన యానిమల్ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ మూవీపై ఓ ఎంపీ తీవ్ర విమర్షలు గుప్పించారు. దీనికి కారణం ఆయన కూతురు యానిమల్ సినిమా చూస్తూ థియేటర్ నుంచి ఏడ్చుకుంటూ బయటకు రావడమే.

పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన యానిమల్ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ మూవీపై ఓ ఎంపీ తీవ్ర విమర్షలు గుప్పించారు. దీనికి కారణం ఆయన కూతురు యానిమల్ సినిమా చూస్తూ థియేటర్ నుంచి ఏడ్చుకుంటూ బయటకు రావడమే.

MP కూతురుని బయపెట్టిన యానిమల్.. ఆ సీన్స్ చూసి ఏడ్చుకుంటూ బయటకు

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో.. రణ్ బీర్ కపూర్ నటించిన తాజా చిత్రం యానిమల్. ఈ మూవీలో రణ్ బీర్ కి జంటగా రష్మిక నటించింది. అయితే భారీ అంచనాల నడుమ డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. యానిమల్ సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు కావొస్తున్నా.. హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తూ యానిమల్ వేట కొనసాగిస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా మారిన సందీప్.. తొలి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్నారు. అలాగే టాలివుడ్ నుంచి బాలివుడ్ కి వెళ్లిన ఆయన.. అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కబీర్ సింగ్ గా రిమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మళ్లీ యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

రణ్ బీర్-రష్మిక కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ.. మరికొందరు ఈ సినిమాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు కారణం.. ఈ మూవీలో బోల్డ్ సన్నివేశాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా.. లైంగిక, గృహ హింసకు సంబంధించిన కంటెంట్ ఉందంటూ విమర్శిస్తున్నారు. వీటి పై ఒకొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఈ మూవీ పై విరుచుకుపడ్డారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

mp angry on animal movie

తాజాగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ ఈ సినిమాను విమర్శించారు. ఇటీవలే సినిమాను చూసిన తన కుమార్తె ఏడుస్తూ.. థియేటర్ నుంచి బయటకు వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సినిమా అనేది సమాజానికి అద్దంలాంటిది, మనం దానిని చూస్తూ పెరిగాము, సినిమా అనేది యువత పై చాలా ప్రభావం చూపుతుంది. ఈ రోజుల్లో అలాంటి కొన్ని సినిమాలు వస్తున్నాయి, రీసెంట్ గా యానిమల్ అనే సినిమా రిలీజ్ అయ్యింది. మొదట కబీర్ సింగ్, పుష్ప లాంటి సినిమాలు వచ్చాయి, ఇప్పుడు యానిమల్ వచ్చింది. నా కూతురు తన కాలేజ్ ఫ్రెండ్స్‌తో కలిసి సినిమా చూడటానికి వెళ్ళింది, ఏడుపు ఆపుకోలేక మధ్యలోనే బయటకు వెళ్ళిపోయింది అని అన్నారు. కబీర్ సింగ్‌ని చూడండి.. ఆ సినిమాలో హీరో తన భార్యను, వ్యక్తులపై అలాగే సమాజం పై ఎలా ప్రవర్తిస్తాడో చూపించారు. యానిమల్ సినిమా గురించి నా కూతురు చాలా చెప్పింది. ”

హింస, మహిళల వేధింపులు వంటివి ఈ చిత్రంలో చూపించడం నాకు ఇష్టం లేదు. నెగెటివ్ రోల్స్ ప్రెజెంట్ చేయడంలో ఈ పిక్చర్స్,ఈ హింస, ఈ రోజుల్లో మన 11,12వ తరగతి పిల్లలపై ప్రభావం చూపుతున్నాయి. మనం సినిమాల్లో చూస్తున్నాం కాబట్టి, సమాజంలో కూడా ఇలాంటి హింసను చూస్తున్నాం. దీనినే జనాలు రోల్ మోడల్ గా భావించడం మొదలుపెట్టారు. ఇక సినిమాలో.. “అర్జన్ వాయిలీ” పాటను ఉపయోగించడాన్ని కూడా ఎంపీ విమర్శించారు. పంజాబీ యుద్ధ గీతంను సినిమాలో రణబీర్ కపూర్ పాత్ర హంతక విధ్వంసానికి దారితీసే సన్నివేశంలో చూపించారని ఆమె అన్నారు. మరి, ఈ సినిమా పై కాంగ్రస్ ఎంపీ చేసిన విమర్శల మీద మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి