iDreamPost

యువతులకు ఫ్రీ స్కూటీ స్కీమ్.. అర్హతలు- అప్లై విధానం!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజల్లోకి వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజల్లోకి వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.

యువతులకు ఫ్రీ స్కూటీ స్కీమ్.. అర్హతలు- అప్లై విధానం!

ఇటీవల తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. గత ఏడాది డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల పై తొలి సంతకం చేశారు. ఈ క్రమంలోనే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు. అంతేకాదు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మారు మూల పల్లె నుంచి పట్టణాల వరకు భారీ స్పందన వచ్చింది. కోటి మందికి పైగా ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు సంబంధించిన మరో పథకం అమలుకు సిద్దం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలలో భాగంగా యువతులకు ఉచితంగా స్కూటీలను ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్న ప్రభుత్వం.. తాజాగా యువతులకు ఉచితంగా స్కూటీలను అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈ స్కీమ్ తమ మేనిఫెస్టోలో పెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అర్హులైన యువతులు 18 ఏళ్లు దాటి ఉండాలి. ఉచిత ఎలక్ట్రికల్ స్కూటీ కోసం అప్లై చేయాలనుకునే యువతులు తెలంగాణ పౌరురాలై ఉండాలి. ప్రస్తుతం ఏదైనా కాలేజ్ లో చదువుతూ ఉండాలి, తెలంగాణలో పేద కుటుంబానికి చెందిన యువతి అయి ఉండాలి. ఇంటర్ తప్పకుండా పాసై ఉండాలి.ఈ పథకం కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవొచ్చు. ఇందుకు ఉండాల్సిన అర్హత, కవాల్సిన ఐడీలు, డాక్యుమెంట్లు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.

ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్ట్ సైజు ఫోటో, అడ్రస్ ప్రూఫ్, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్.. ఈ డాక్యూమెంట్స్, ఐడీలను దగ్గరుంచుకొని ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ https://telangana.gov.in లోకి వెళ్లాలి. హూం పేజిలో త్వరలోనే ఆప్ లైన్ అప్లికేషన్ ఫారాలు అందుబాటులో ఉంచనున్నారు. వెబ్ సైట్ లోకి వెళ్లి స్కూటీ స్కింపై దరఖాస్తు విధానం క్లిక్ చేయగానే.. అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. అందులో మన వ్యక్తిగత వివరాలు, చిరునామా, కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా అప్ లోడ్ చేయాలి. అప్లై చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని సబ్ మిట్ పై క్లిక్ చేయాలి. తర్వాత సంబంధిత అధికారులు దరఖాస్తులను పరిశీలించి.. అర్హతలు, పత్రాలను పరిశీలించి సరిగా ఉన్నాయని నిర్దారించుకున్న తర్వాత అర్హత గల యువతులకు స్కూటీలు అందజేస్తారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి