iDreamPost

TS Election Results 2023: కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తం! గెలిచిన అభ్యర్థులపై ప్రత్యేక నిఘా!

సర్వేలు అంచనా వేసినట్లుగానే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటుతోంది. ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 55 స్థానాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో నిలిచింది...

సర్వేలు అంచనా వేసినట్లుగానే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటుతోంది. ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 55 స్థానాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో నిలిచింది...

TS Election Results 2023: కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తం! గెలిచిన అభ్యర్థులపై ప్రత్యేక నిఘా!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలైంది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఓట్ల లెక్కింపు మొదలైంది. ప్రస్తుతం తెలంగాణలో 119 స్థానాలకు సంబంధించి కౌంటింగ్‌ జరుగుతోంది. సర్వేలు అంచనా వేసినట్లుగానే ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్‌ మెజార్టీలో ఉంది. దాదాపు 55 స్థానాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం 25 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.

ఈ సారి కాంగ్రెస్‌ మెజార్టీ సాధించే అవకాశం కచ్చితంగా ఉందని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కడా పొరపాట్లు జరక్కుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. గెలిచిన ఎమ్మెల్యేలను పక్కకు పోకుండా పగడ్భందీ చర్యలు తీసుకుంటోంది. సీనియర్‌ నేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్‌ ముఖ్య నేత డీకే శివకుమార్‌ హైదరాబాద్‌లో పాగా వేశారు. ఫలితాలు తమకు అనుకూలంగా వస్తున్న నేపథ్యంలో మున్ముందు ఏం చేయాలో వ్యూహ రచనలు చేస్తున్నారు.

తెలంగాణ ఫలితాలపై కాంగ్రెస్‌ కట్టుదిట్టమైన చర్యలు

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 60 సీట్లు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫలితాల సరళి చూస్తే కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. అయితే, గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థులను పక్కకు పోనివ్వకుండా చూసేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇన్‌ఛార్జీ ఠాక్రే సమక్షంలో రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మదుయాస్కీ గౌడ్‌, పొంగులేటి శ్రీనివాసరరెడ్డి తదితర కీలక నేతలు నిన్ననే భేటీ అయ్యారు. ముందు జాగ్రత్త చర్యలపై చర్చించారు. గెలిచిన వారిని ముందే హైదరాబాద్‌కు రప్పించనున్నారు. వారిని ఓ సేఫ్టీ ప్లేసులో ఉంచనున్నారు. రాష్ట్రంలోని 49 కేంద్రాల వద్దకు ఏఐసీసీ పరిశీలకులు వెళ్లనున్నారు. అంతేకాదు! కాంగ్రెస్‌ పార్టీ గెలిచే ఒక్కో అభ్యర్థికి ఒక్కో పరిశీలకుడిని నియమించనుంది.

పది గంటల కల్లా ఫలితాల సరళి..

 ఉదయం పది గంటల కల్లా ఫలితాల సరళి తెలియనుంది. గెలుపు గుర్రాలు ఎవరు అనేది ఆ సమయానికి దాదాపు ఖరారు కానుంది. రాష్ట్రంలో ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కౌంటింగ్‌కు ఎక్కువ సమయం పట్టనుంది. ఓటర్లు తక్కువగా ఉన్న నియోజకవర్గాలకు తక్కువ సమయం పట్టనుంది. శేరిలింగంపల్లి, కుత్భుల్లాపూర్‌, రాజేంద్రప్రసాద్‌, మహేశ్వరం, ఎల్బీనగర్‌, మేడ్చల్‌లలో ఎక్కువ పోలింగ్‌ క్రేందాలు ఉన్నాయి. దీంతో కౌంటింగ్‌కు టైం పడుతుంది. ఇక, అతి తక్కువగా భద్రాచలంలో 13, అశ్వారావుపేటలో 14, చార్మినార్‌లో 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. మధ్యాహ్నం 1 గంటకల్లా వీటి ఫలితాలు వెలవడనున్నాయి. మరి, గెలుపు నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్టానం అప్రమంత్తం అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

The liveblog has ended.
No liveblog updates yet.

LIVE NEWS & UPDATES

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి