iDreamPost

ఎన్నికల పోటీ విషయంలో కోదండరాం సంచలన ప్రకటన!

తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమందికి తన ప్రసంగాల ద్వారా స్పూర్తి కలిగించిన ప్రొఫెసర్ కోదండరాం 2018లో తెలంగాణ జన సమితి(టీజెఎస్) పార్టీని స్థాపించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమందికి తన ప్రసంగాల ద్వారా స్పూర్తి కలిగించిన ప్రొఫెసర్ కోదండరాం 2018లో తెలంగాణ జన సమితి(టీజెఎస్) పార్టీని స్థాపించారు.

ఎన్నికల పోటీ విషయంలో కోదండరాం సంచలన ప్రకటన!

తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమంది ఉన్నత విద్యావంతులు, హోదాలో ఉన్నవారు ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి కలిగించారు. అలాంటి వారిలో ముద్దసాని కోదండరాం రెడ్డి అలియాస్ ప్రొఫెసర్ కోదండరాం ఒకరు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీ జేఏసీ) కి చైర్మన్ గా కొనసాగారు. ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకొని ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లే పట్నం తిరుగుతూ తన ప్రసంగాలతో ప్రజల్లో చైతన్యం కలిగించారు. టీజేఏసీ కన్వీనర్ గా రాజకీయ, రాజకీయేతర సంస్థలన్నీ ఒకేతాటిపైకి తెచ్చి తెలంగాణ ఏర్పాటుకు కృషి చేశారు.

తెలంగాణ కోసం కొనసాగిన సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మ, సాగర హారం ఇలా ఎన్నో కార్యక్రమాలకు బాధ్యత వహించి ప్రత్యేక రాష్ట ఆవిర్భావానికి కృషి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికార పార్టీతో విభేదాలు రావడంతో 2018లో తెలంగాణ జన సమితి(టీజెఎస్) ని ఏర్పాటు చేశారు. తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాహుల్ గాంధీతో భేటీ అనంతరం కోదండ రామ్ మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం జరిపిన తనకు.. ప్రస్తుతం ప్రభుత్వ పాలన చూస్తుంటే బాధగా ఉంటుందని.. అందుకే ప్రభుత్వ విధానాలపై మళ్లీ పోరాటం చేస్తున్నామని అన్నారు. రాహుల్ గాంధీతో చర్చలు జరిగాయని, కాంగ్రెస్ తో సీట్ల సర్ధుబాటు పై మరోసారి సమావేశం అవుతామని తెలిపారు. ఈ విషయంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో త్వరలో క్లారిటీ వస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని రాహుల్ గాంధీ కోరారన్నారు. కానీ తనకు ఆసక్తి లేదని చెప్పానన్నారు. ప్రజలకు మంచి పాలన అందించడం కోసం కష్టపడతానన్నారు. కోదండరాం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలో సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి