iDreamPost

గ్రూప్-2 వాయిదా వేయాలని అభ్యర్ధుల ఆందోళన.. అరెస్టు చేసిన పోలీసులు

గ్రూప్-2 వాయిదా వేయాలని అభ్యర్ధుల ఆందోళన.. అరెస్టు చేసిన పోలీసులు

గత కొన్నిరోజుల నుంచి తెలంగాణలో త్వరలో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గురువారం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో TSPSC కార్యాలయాన్ని ముట్టడించారు. ఇక ఆఫీసు ముందు భైఠాయించి గ్రూప్-2 పరీక్షను వెంటనే వాయిదా వేయాల్సిందే అంటూ ఆందోళన చేపట్టారు. ఇంతే కాకుండా కొందరు అభ్యర్థులు గేట్ దూకి కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

అయితే పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి అక్కడి నుంచి తిప్పి పంపించే ప్రయత్నం చేశారు. అయినా వినని అభ్యర్థులు.. గేట్ దూకేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. గ్రూప్-2 అభ్యర్థులు పెద్ద ఎత్తున రావడంతో TSPSC కార్యాలయం ముందు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక పరిస్థితి చేయి దాటకముందే పోలీసులు అప్రమత్తమై అభ్యర్థులను, పార్టీ నేతలను అరెస్ట్ చేశారు. కాగా, అభ్యర్ధులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దాయాకర్, తెలంగాణ జన సమితి పార్టీ నుంచి కొదండరాం తదితర నేతలు పాల్గొని మద్దతునిచ్చారు.

ఇది కూడా చదవండి: జర భద్రం: హైదరాబాద్‌లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి