iDreamPost

గురూజీ బురూజీ అంటూ త్రివిక్రమ్ పై బండ్ల షాకింగ్ కామెంట్స్!

సినిమా వేడుకల్లో పవన్ గురించి బండ్ల ఇచ్చే స్పీచ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తారు. ఆయన నామ స్మరణ అంతలా చేస్తాడు కాబట్టే పవన్ ఫ్యాన్ అనగానే మనకి ఇండస్ట్రీలో ముందుగా బండ్ల పేరే గుర్తుకొస్తుంది. అయితే పవన్ ప్రాణ స్నేహితుడు, దర్శకుడు త్రివిక్రమ్ పేరు వింటే మాత్రం బండ్ల ఊగిపోతున్నాడు.

సినిమా వేడుకల్లో పవన్ గురించి బండ్ల ఇచ్చే స్పీచ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తారు. ఆయన నామ స్మరణ అంతలా చేస్తాడు కాబట్టే పవన్ ఫ్యాన్ అనగానే మనకి ఇండస్ట్రీలో ముందుగా బండ్ల పేరే గుర్తుకొస్తుంది. అయితే పవన్ ప్రాణ స్నేహితుడు, దర్శకుడు త్రివిక్రమ్ పేరు వింటే మాత్రం బండ్ల ఊగిపోతున్నాడు.

గురూజీ బురూజీ అంటూ త్రివిక్రమ్ పై బండ్ల షాకింగ్ కామెంట్స్!

నిజమైన పవన్ కళ్యాణ్ ని బయటకు తీసింది నేను.. త్రివిక్రమ్ పై బండ్ల షాకింగ్ కామెంట్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఎంతటి వీరాభిమానో తెలిసిందే. పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చాడు. సినిమా వేడుకల్లో పవన్ గురించి బండ్ల ఇచ్చే స్పీచ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తారు. ఆయన నామ స్మరణ అంతలా చేస్తాడు కాబట్టే పవన్ ఫ్యాన్ అనగానే మనకి ఇండస్ట్రీలో ముందుగా బండ్ల పేరే గుర్తుకొస్తుంది. అయితే పవన్ ప్రాణ స్నేహితుడు, దర్శకుడు త్రివిక్రమ్ పేరు వింటే మాత్రం బండ్ల ఊగిపోతున్నాడు.

తాజాగా బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ పై పరోక్షంగా కామెంట్స్ చేశాడు. “నిజమైన పవన్ కళ్యాణ్ గారిని బయటకు తీసింది నేను. ఈయన మామూలు మనిషి కాదు.. అతీతమైన వ్యక్తి.. ఈయన వేరే స్థాయిలో ఉండాలి అని అనుకున్నది నేను. ఇప్పుడేదో గురూజీలు, బురూజీలు చాలామంది వచ్చారు” అంటూ బండ్ల చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. త్రివిక్రమ్ ని ఇండస్ట్రీలో గురూజీ అని పిలుస్తుంటారు. తాజాగా బండ్ల చేసిన వ్యాఖ్యలు త్రివిక్రమ్ గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్ తీన్ మార్, గబ్బర్ సింగ్ అనే చిత్రాలను నిర్మించాడు. అందులో తీన్ మార్ నిరాశపరచగా, గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలతో సినిమాలు చేసిన బండ్ల.. ఎనిమిదేళ్లుగా ప్రొడక్షన్ కి దూరంగా ఉంటున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాతోనే మళ్లీ ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇవ్వాలని బండ్ల కొంతకాలంగా ప్రయత్నిస్తుండగా.. త్రివిక్రమ్ ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లు టాక్ ఉంది. పవన్ సినిమాల ఎంపిక విషయంలో కొంతకాలంగా త్రివిక్రమ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కాదన్న దర్శక నిర్మాతలకు పవన్ తో సినిమా చేసే అవకాశం లేనట్లేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే మాట. తనకు పవన్ తో సినిమా చేసే అవకాశం రాకపోవడానికి త్రివిక్రమే కారణమని భావించిన బండ్ల ఆయనను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో భీమ్లా నాయక్ మూవీ ఈవెంట్ కి తనను రాకుండా త్రివిక్రమ్ అడ్డుకుంటున్నాడు అంటూ బండ్ల ఫోన్ కాల్ మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి లీక్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి గురూజీ బురూజీ అంటూ త్రివిక్రమ్ ని టార్గెట్ చేయడం సంచలనంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి