iDreamPost

కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య వార్!

TDP, Janasena: మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. ఇక్కడ అధికార వైసీపీ, ప్రతిపక్షాల మధ్య వార్ కంటే.. పొత్తుతో ముందుకెళ్తున్న టీడీపీ,జనసేన మధ్య ఎక్కువగా ఉంది.

TDP, Janasena: మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. ఇక్కడ అధికార వైసీపీ, ప్రతిపక్షాల మధ్య వార్ కంటే.. పొత్తుతో ముందుకెళ్తున్న టీడీపీ,జనసేన మధ్య ఎక్కువగా ఉంది.

కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య వార్!

ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇక్కడి ఎన్నికలు ఎండకాలంలో వచ్చే వేడిను మించి ఉన్నాయి. అయితే అధికార వైసీపీ, ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ వేడి అనుకుంటే పొరపాటే. పొత్తుతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న టీడీపీ, జనసేన మధ్య ఈ హీట్ నడుస్తోంది. ఎవరికి ఎన్ని సీట్లు అనే దానిపై కార్లిటీ లేదు. దీంతో క్షేత్ర స్థాయిలో ఇరు పార్టీల నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని నియోజవర్గాల్లో ఈ రెండు పార్టీల కార్యకర్తల మధ్య బహిరంగంగానే ఫైటింగ్ చేసుకున్నారు. అలానే రెండు రోజుల క్రితం భీమవరం పర్యటనలో పవన్ తీరుపై స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కాకినాడ రూరల్ లో టీడీపీ, జనసేన మధ్య  మరో రచ్చ జరిగింది.

జనసేన, టీడీపీల పొత్తు చిత్తు అయ్యేలా కనిపిస్తుందనే వార్తలు వినిపిస్తోన్నాయి. అంతేకాక జనసేనను ఓడించేందుకు వైసీపీ అవసరం లేదని, టీడీపీ వాళ్లే సిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఆ ప్రచారాలను నిజం చేస్తూ.. పలు నిజయోజవర్గాల్లో టీడీపీ,జనసేన నేతలు, కార్యకర్తలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. పొత్తు ధర్మంలో  భాగంగా తాము పవన్ మీటింగ్ వస్తే అవమానిస్తారా అంటూ బహిరంగానే టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే తణుకులోనూ ఇద్దరి నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. నాకంటే నాకు అని అక్కడి నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.

తాజాగా కాకినాడ రూరల్ జనసేన ఆఫీస్ ప్రారంభం చేయడంతో మరోసారి ఇరు పార్టీల మధ్య వార్ నడిచింది. గురువారం కాకినాడ రూరల్  లో పార్టీ కార్యాలయాన్ని జనసేన ప్రారంభించింది. అయితే టికెట్ కేటాయించకుండానే పార్టీ ఆఫీస్ ను ప్రారంభించడంపై స్థానిక టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేన తీరును టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్యనారాయణ తప్పుపట్టారు. గురువారం జనసేనకు టికెట్ ఇస్తే సహకరించబోమని టీడీపీ నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకటనపై క్షమాపణలు చెబుతూనే జనసేన తీరును  పిల్లి సత్యనారాయణ తప్పుపట్టారు. తమ ఇష్టం వచ్చినట్లుగా కార్యక్రమాలు చేస్తే ఎలా అంటూ పిల్లి వర్గీయులు పశ్నిస్తోన్నారు. తమ కుటుంబంపై తప్పుగా చెప్పి టికెట్ రాకుండా దుష్టశక్తులు కుట్ర చేశాయని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనకు బీసీల ఓట్లు అవసరం లేదా? అంటూ పిల్లి అనంతలక్ష్మి మండిపడ్డారు.

తమకు తెలియకుండా జనసేన కార్యాలయం ఎలా ప్రారంభిస్తారని. జనసేన తీరు వల్లే తమ క్యాడర్‌ రియాక్ట్‌ అయ్యిందని ఆమె తెలిపారు. చంద్రబాబుకు జనసేనే ఊపిరి పోసిందని ఓ ఆసామీ మాట్లాడారని, ఆ వ్యాఖ్యలకు తాము చేతకాని వాళ్లలా ఊరుకోవాలా? అని పిల్లి అనంతలక్ష్మి ప్రశ్నించారు. మొత్తంగా గెలుపు విషయం పక్కన పెడితే.. అసలు ఎవరికిచ్చిన ఒకరినొకరు ఓడించుకునేందుకు స్థానిక టీడీపీ, జనసేన నేతలు సిద్ధంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి.. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజవర్గాల్లో టీడీపీ, జనసేన పరిస్థితి ఇలానే ఉంది. మరి..సీట్లపై స్పష్టత వస్తే..మాత్రం ఈ వార్ మరో రేంజ్ లో ఉండొచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి