iDreamPost

మీ పిల్లలు జలుబుతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే వెంటనే తగ్గుతుంది

  • Published Nov 06, 2023 | 10:35 AMUpdated Nov 06, 2023 | 10:35 AM

జలుబు చూడ్డానికి సాధారణ అనారోగ్యంగానే కనిపిస్తుంది కానీ.. దాన్ని అనుభవించే వారికే తెలుస్తుంది అది ఎంత తీవ్ర సమస్యో. కోల్డ్‌ చేస్తే పెద్దలు తట్టుకోవడమే కష్టం. ఇక చిన్నారుల పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పిల్లలకు జలుబు త్వరగా తగ్గాలంటే.. ఇవి ఫాలో అవ్వాలి.

జలుబు చూడ్డానికి సాధారణ అనారోగ్యంగానే కనిపిస్తుంది కానీ.. దాన్ని అనుభవించే వారికే తెలుస్తుంది అది ఎంత తీవ్ర సమస్యో. కోల్డ్‌ చేస్తే పెద్దలు తట్టుకోవడమే కష్టం. ఇక చిన్నారుల పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పిల్లలకు జలుబు త్వరగా తగ్గాలంటే.. ఇవి ఫాలో అవ్వాలి.

  • Published Nov 06, 2023 | 10:35 AMUpdated Nov 06, 2023 | 10:35 AM
మీ పిల్లలు జలుబుతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే వెంటనే తగ్గుతుంది

కాలుష్యం, వాతావరణంలో మార్పులు కారణంగా.. సీజన్‌తో పని లేకుండా.. జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. చలికాలం, వర్షాకాలంలో అయితే ఈ సమస్యలు మరి కాస్త ఎక్కువే. పెద్దవారే తట్టుకోవడం కష్టం.. ఇక చిన్నారుల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి జలుబు బారిన పడితే.. చాలా నీరసించి పోతారు. ఆహారం సరిగా తినరు. పైగా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. పెద్దలంటే ఏదో విధంగా అడ్జెస్ట్‌ అవుతారు.. కానీ పిల్లల పరిస్థితి అలా కాదు. ఇక ఈ సీజన్‌లో జలుబు మాత్రమే కాక దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్‌ సమస్యలు కూడా వెంటాడతాయి. మరి వాటి నుంచి మీ చిన్నారులు తక్షణమే ఉపశమనం పొందాలంటే.. ఈ చిట్కాలను పాటించాలి.

  1. పిల్లల్లో జలుబు, జ్వరం లక్షణాలు కనిపించగానే ఎక్కువ డోస్‌ లేని పారాసిటమాల్‌ టాబ్లెట్‌లు.. మరి చిన్న పిల్లలయితే పారాసిటమాల్‌ సిరప్‌ వాడవచ్చు.
  2. ఇక జలుబు పూర్తిగా తగ్గే వరకు.. రోజుకు మూడుసార్లు వేడి నీళ్లలో ఉప్పు వేసుకొని పుక్కిటపట్టించాలి.
  3. పిల్లలు జలుబుతో బాధపడుతుంటే.. రోజులో కనీసం మూడుసార్లయినా పసుపు లేదా, జండుబామ్‌, విక్స్‌.. వేడి నీటిలో వేసుకుని ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గడంతో పాటు వెంటనే ఉపశమనం కలుగుతుంది.
  4. జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు ఆవనూనెకు వెల్లుల్లి కలిపి చిన్నారి ఛాతీపైనా, మెడ, వీపు భాగాల్లోనూ రుద్దితే మంచి ఫలితం ఉంటుంది.
  5. పిల్లలు జలుబుతో బాధపడుతున్నప్పుడు వారికి తరచుగా మంచినీరు తాగిస్తుండటం వల్ల కోల్పోయిన నీటి శాతం భర్తీ అయి శరీరానికి వ్యాధితో సమర్థంగా పోరాడగల శక్తి వస్తుంది.
  6. ఈ సీజన్‌లో వచ్చే అనేక జబ్బులకు నీళ్లే కారణం. కనుక.. చిన్నారులు మాత్రమే కాక పెద్దలు కూడా అందరూ కాచి, చల్లార్చి వడపోసిన నీటిని మాత్రమే సేవిస్తే మంచిది.

తీసుకోవాల్సిన ఆహారం..

  • జలుబు లక్షణాలను త్వరగా తగ్గించే వాటిలో ముఖ్యమైనది నిమ్మపండు.
  • జలుబు చేస్తే.. గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం, కాస్త తేనె కలుపుకొని రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు.
  • అలానే మిరియాలు, వెల్లుల్లి, అల్లం వంటివి ముక్కు దిబ్బడను తగ్గించడంతో పాటు, జలుబు చేసిన సమయంలో ఉపశమనం కలిగిస్తాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి