iDreamPost

చంద్రబాబు పేరు చెబితే వంచన, మోసాలే గుర్తుకు వస్తాయి: CM జగన్

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నంద్యాల జిల్లాలో పర్యటించారు. మూడో విడత వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు.

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నంద్యాల జిల్లాలో పర్యటించారు. మూడో విడత వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు.

చంద్రబాబు పేరు చెబితే వంచన, మోసాలే గుర్తుకు వస్తాయి: CM జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు.  కర్నూలు, నంద్యాల జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన సాగుతోంది. కర్నూలులోని జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి సీఎం జగన్ శంకుస్థాపన  చేశారు. అనంతరం నంద్యాల జిల్లాలోని బనగానపల్లె నియోజవర్గంలో  సీఎం జగన్ పర్యటన కొనసాగింది. అక్కడ వైఎస్సార్ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులన వారికి  నగదను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో  సీఎం జగన్ ప్రసంగించారు. తమ ప్రభుత్వంలో జరిగిన మేలును ప్రస్తావిస్తూనే..చంద్రబాబు పాలన అంతా మోసం, వంచనలతో సాగిందని దుయ్యబట్టారు.

జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ ఈబీసీ నేస్తం మూడవ విడత పంపిణీ కార్యక్రమానికి నంద్యాల జిల్లా  బనగానపల్లి వేదికైంది.  ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరు రూ.15 వేలను డీబీటీ రూపంలో జమ చేస్తుంది.  ఇప్పటి వరకు రెండు విడతల్లో ఈ పథకం అమలు  జరిగింది. తాజాగా మూడో విడత నిధుల విడుదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. గురువారం బనగానపల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ నుంచి మూడో విడత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి సీఎం జగన్ విడుదల చేశారు. మొత్తం  4,19,583 మంతి ఖాతాల్లో రూ.629.37 కోట్ల ను సీఎం జగన్  జమ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. టీడీపీ, చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

సీఎం జగన్ మాట్లాడుతూ..” వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు తీసుకొచ్చాం.  ఈ స్కీమ్ ద్వారా నేడు 4,19,583 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.629.37 కోట్లు జమ చేస్తున్నాం. మొత్తంగా మూడు దఫాల్లో 4 లక్ష 95 వేల మందికి  మంచి జరిగింది.  రూ.1877 కోట్ల రూపాయలు వైఎస్సార్ ఈబీసీ పథకం ద్వారా మాత్రమే మంచి చేయగలిగాం. కొత్తగా 65 వేల మంది ఈ  సాయం అందుకుంటున్నారు. పేదరికం వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదనే మన ప్రభుత్వం ఈ  పథకం తీసుకొచ్చింది. ఈ  వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా  పేద మహిళలకు ఎంతో  మేలు జరిగింది.  పేదరికానికి కులం ఉండదు, పేదవాళ్లను ఆదుకునే గుణం ప్రభుత్వానికి ఉండాలి” అని సీఎం జగన్ తెలిపారు.

ఇదే వేదికపై నుంచి చంద్రబాబు, పవన్  గురించి కూడా సీఎం జగన్ ప్రస్తావించారు. ” చంద్రబాబు పేరు చెబితే.. అక్కా చెల్లెమ్మలకు చేసిన వంచన గుర్తొస్తుంది. అలానే డ్వాక్రా మహిళకు చేసిన దగా గుర్తొస్తుంది. చంద్రబాబు పేరు చెబితే  ఒక్క మంచి గుర్తుకు రాదు.  చంద్రబాబు పేరు చెబితే.. మోసం, వంచనాలే గుర్తుకు వస్తాయి.  ఇక దత్తపుత్రుడి పేరు చెబితే.. ఐదేళ్లకు ఒకసారి కార్లను మార్చేసినట్లు భార్యలను మార్చే ఓ మ్యారేజ్  స్టార్ గుర్తొస్తాడు. మూడుపార్టీలు కూటమిగా ఏర్పడి మీ బిడ్డ మీదకు యుద్ధానికి వస్తున్నారు. మీ బిడ్డ మీద కంటే.. పేదల వాడి భవిష్యత్తు మీదకు యుద్ధంగా వస్తున్నారు. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడాను గమనించండి” అని ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి