iDreamPost

మన్నించాలని మనసులు గెలుచుకున్న జగన్

మన్నించాలని మనసులు గెలుచుకున్న జగన్

తన వల్ల తప్పు, పొరపాటు జరిగితే క్షమాపణ కోరేందుకు కొంత మంది తటపటాయిస్తారు. జరిగిన పొరపాటును ఒప్పుకునేందుకు సంకోశిస్తారు. ఇక ఉన్నత స్థాయిలో ఉన్న వారైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాజికంగా, రాజకీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వారు తమ వల్ల జరిగిన పొరపాటును గుర్తించి దాటవేసేవారు కొందరైతే.. క్షమాపణలు కోరేవారు బహుఅరుదుగా ఉంటారు. గొప్ప మనసు, వ్యక్తిత్వం ఉన్నవారు మాత్రమే క్షమాపణలు కోరగలరు. ఈ కోవకే చెందుతారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.

నిన్న పులివెందులలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇందులో సాగునీటికి సంబంధించిన పనులు ఉన్నాయి. గండికోట, చిత్రావతి, పైడిపాలంలలో కొత్తగా 4300 కోట్ల రూపాయలతో లిఫ్ట్‌లు ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టారు. కృష్ణా నది వరదల సమయంలో గండికోట, చిత్రావతి ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో నింపారు. 26.85 టీఎంసీల గండికోట ప్రాజెక్టులో మొన్నటి వరకూ 12 టీఎంసీలే నిల్వ చేస్తుండగా.. నిర్వాసితులను తరలించి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మేరకు నింపారు. అదే విధంగా చిత్రావతిలో మొన్నటి వరకు ఐదు టీఎంసీలే నిల్వ చేయగా.. నిర్వాసితులకు పునరావాసం కల్పించి పూర్తి సామర్థ్యం పది టీఎంసీల మేర నింపారు. దీంతో ఆయా ప్రాజెక్టుల కింద కొత్తగా సాగు విస్తీర్ణం పెంచేందుకు మార్గం సుగమమైంది.

గండికోట, చిత్రావతి ప్రాజెక్టుల నిర్వాసితులు అక్కడ నుంచి వెళ్లే సమయంలో కొంత ఇబ్బంది పడ్డారు. అకస్మాత్తుగా వెళ్లాల్సి రావడం, పైగా పునరావాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై ఉన్న ఆందోళన.. నిర్వాసితుల్లో భయాలను నింపింది. ఈ క్రమంలో వారు అయిష్టాపూర్వకంగానే తమ ప్రాంతాల నుంచి పునరావాస ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఈ సమయంలో నిర్వాసితుల ఆవేదన అందరినీ కలచివేసింది. ఉన్నఫళంగా వెళ్లాల్సి రావడంతో వారు తీవ్ర మానసిక సంఘర్షణనకు లోనయ్యారు. ఆ పరిస్థితిని చూసిన సీఎం వైఎస్‌ జగన్‌.. నాడు జరిగిన పొరపాట్లను నిన్న గుర్తు చేసుకున్నారు. ఉన్నఫళంగా ఖాళీ చేయాల్సిన పరిస్థితిలో ఇబ్బందులు పడిఉంటారన్న సీఎం వైఎస్‌ జగన్‌.. మీ బిడ్డనైన తాను ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించాలని రెండు చేతులు జోడించి కోరారు.

సీఎం వైఎస్‌ జగనే అశేష జనవాహిని సమక్షంలో బహిరంగంగా క్షమాపణలు కోరడంతో.. గండికోట, చిత్రావతి నిర్వాసితులు తమ ప్రాంతాలను ఖాళీ చేసే సమయంలో వారు పడిన మానసిక సంఘర్షణ, ఆవేదనను తొలగించిందని చెప్పవచ్చు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు నిర్మించే సమయంలో ముంపు సర్వసాధారణం. ఒకరు తమ సర్వస్వం వదులుకొని వెళుతుంటే.. వారి త్యాగాలతో ఇతరులకు మేలు జరుగుతుంది. నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివి. అందుకే సీఎం వైఎస్‌ జగన్‌.. గండికోట, చిత్రావతి నిర్వాసితుల త్యాగాలను కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం నిర్వాసితులకు రెట్టింపు నగదు ఇచ్చినా.. సీఎం వైఎస్‌ జగన్‌ వారి త్యాగాలను కొనియాడడం, తప్పు జరిగి ఉంటే క్షమించాలని కోరడం వారికి ఎంతో ఊరటకలిగించే అంశం.

సీఎం వైఎస్‌ జగన్‌ క్షమాపణ కోరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రజల పట్ల, రాష్ట్రం కోసం నష్టపోయిన వారి పట్ల రాష్ట్ర పెద్దగా, ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్‌ జగన్‌ తన బాధ్యతనెరిగి వ్యవహరిచారని కొనియాడుతున్నారు. మంచి మనసున్న ముఖ్యమంత్రిగా పని చేస్తానన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆ మాటలను చేతల్లోనూ చూపుతూ అందరి మన్నన్నలను పొందుతున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఈ తరహా ప్రవర్తవతో పోలవరం సహా ఇతర ప్రాజెక్టు ముంపు వాసుల్లో ఆత్మస్థయిర్యాన్ని, భరోసాను నింపుతుందనడంలో సందేహం లేదు.

Read Also : ఇళ్ల పట్టాల పంపిణీలో లబ్ధిదారులకు ఊహించని బహుమతి ప్రకటించిన సీఎం జగన్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి