iDreamPost

ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా ఏపీ: CM జగన్

YS Jagan: నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృతులు వారు..తమ కాళ్ల మీద నిలదొక్కుకొనేలా జగనన్న తోడు పథకం కింద ఆర్థిక చేయూత నిస్తున్నారు. తాజాగా ఎనిమిదో విడత జగనన్న తోడు పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.

YS Jagan: నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృతులు వారు..తమ కాళ్ల మీద నిలదొక్కుకొనేలా జగనన్న తోడు పథకం కింద ఆర్థిక చేయూత నిస్తున్నారు. తాజాగా ఎనిమిదో విడత జగనన్న తోడు పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.

ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా ఏపీ: CM జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ ను చూపించారు. నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి..అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం రెండిటిని జోడెద్దుల్లా పరిగెత్తిస్తున్నాడు. చిన్నపిల్లల నుంచి, పండు ముసలి వారి వరకు అందరిని వివిధ స్కీమ్స్ తో సీఎం జగన్ ఆదుకుంటున్నారు. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, యువతకు, చిరు వ్యాపారులకు.. ఇలా అన్ని వర్గాల, వృతుల వారికి బటన్ నొక్కి.. నేరుగా నిధులు విడుదల చేస్తున్నారు. ‘జగనన్న తోడు’ పథకం ద్వార చిరు వ్యాపారుల రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. రాష్ట్రంలో ఎనిమిదో విడతలో  కింద నిధులను సీఎం జగన్ బటన్ నొక్కిన్ విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. చిరు వ్యాపారులను ఆదుకోవడంలో ఏపీ..దేశానికే ఆదర్శమని సీఎం అన్నారు.

బుధవారం  సీఎం క్యాంప్ ఆఫీసులో ఎనిమిదో విడద జగనన్న తోడు  స్కీమ్ కింద నిధులను బటన్ సీఎం జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి విడుదల చేశారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి ఒక్కొక్కరి రూ.10వేలు, అంతకుపైన కలిపి రూ.417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలను జగన్ సర్కార్ అందిస్తోంది. మొత్తంగా 16 లక్షల 73 వేల 576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రీయింబర్స్ మెంట్ కింద 5.81 లక్షల మంది లబ్ధిదారులకు రూ.13.64 కోట్లు చెల్లించనున్నారు. ఈ రెండూ కలిపి మొత్తం రూ.431.58 కోట్లను లబ్ధిదారుల బ్యాంకుల ఖాతాల జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

“మన ప్రభుత్వం మానవత్వానికి మారుపేరుగా నిలబడిందని సీఎం జగన్ న అన్నారు. “రాష్ట్రంలో 3.95 లక్షల మందికి చిరు వ్యాపారులకు రూ.417.94 కోట్ల వడ్డీలేని రుణాలు. నాలుగున్నరేళ్లలో గొప్ప అడుగులు పడ్డాయి. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులు నాలుగు సార్లు లబ్ధి పొందారు. చిరు వ్యాపారులకు ఈ స్కీమ్ ఎంతో మేలు  చేసింది.  ఈ స్కీమ్ ద్వారాలబ్ధి పొందే వారిల దాదాపు 87 శాతం మంది మహిళలే ఉన్నారు. ఇది మహిళా సాధికారతకు నిదర్శనం. దేశంలోనే జగనన్న తోడు పథకం ఆదర్శంగా నిలిచింది. మిగత రాష్ట్రాలకు ఏపీ రోల్ మోడల్ గా నిలిచింది. అదే విధంగా వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇది సాధ్యమైంది. చేయిపట్టుకుని నడిపిస్తూ మహిళా సాధికారత దిశగా అడుగులు. ఇంకా మంచి చేసే అవకాశం కలగాలి” అని సీఎం ఆకాంక్షించారు.

ఇక జగనన్న తోడు పథకం విషయానికి వస్తే.. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృతులు వారు..తమ కాళ్ల మీద నిలదొక్కుకొనేలా జగనన్న తోడు పథకం కింద ఆర్థిక చేయూత నిస్తున్నారు. ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల రుణం సున్నా వడ్డీకే అందిస్తున్నారు. రుణాలను సకాలంలో చెల్లించిన వారికి ఏడాదికి మరో రూ.1000 చొప్పున జొడిస్తూ రూ.13 వేల వరకు వడ్డీ లేని రుణాన్ని ఏపీ ప్రభుత్వం అందిస్తుంది. మరి.. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి