iDreamPost

సూపర్ స్టార్ కృష్ణకి సీఎం జగన్ నివాళి..

సూపర్ స్టార్ కృష్ణకి సీఎం జగన్ నివాళి..

సూపర్‌స్టార్‌ అంటే గుండెల్లో గుడి కట్టుకున్న అభిమానం ఇపుడు వెక్కివెక్కి ఏడుస్తోంది. నటశేఖరుడి ప్రస్థానం ముగిసిందనే నిజాన్ని, ఆయన ఈలోకంలో లేరనే వార్తను ఇంకా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

పద్మాలయ స్టూడియోస్‌ లో సూపర్‌ స్టార్‌ కృష్ణ భౌతికకాయానికి ఏపీ సీఎం జగన్ గారు నివాళ్లు అర్పించారు.. హీరో మహేష్‌ బాబుతో పాటు కుటుంబ సభ్యులను సీఎం జగన్‌ పరామర్శించారు.

May be an image of 5 people, people standing and indoor

కడసారి చూపుల కోసం ఎక్కడెక్కడి నుంచో తరలివస్తున్నారు. నిన్నటి నుంచి ఆ అభిమన ప్రవాహం అలా కొనసాగుతూనే ఉంది. తెలుగు లెజండరీ నటులు, సూపర్‌స్టార్‌ కృష్ణ మృతికి ప్రముఖులు సంతాపం తెలిపారు.

CM Jagan Hero Krishna: సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించనున్న సీఎం జగన్..

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. కేసీఆర్ ఆదేశంతో పోలీసుల అధికారిక వందనంతో కృష్ణకు తుది వీడ్కోలు పలకనున్నారు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృష్ణ ఇంటికివచ్చి కృష్ణకు నివాళ్ళర్పించారు. కృష్ణ కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. మరికాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించుకోనున్నారు.

AP CM Jagan wishes Superstar Krishna on his birthday

మధ్యాహ్నం 12 గంటలకు పద్మాలయ స్టూడియోస్‌ నుంచి అంత్యక్రియలు నిర్వహించే మహాప్రస్థానానికి తెలుగు సినీ తేజం సన్‌ ఆఫ్‌ ద సాయిల్‌ కృష్ణ అంతిమయాత్రకు సర్వం సిద్ధం చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని మహాప్ర్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినీ కెరటం కృష్ణ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ కృష్ణకు ఘననివాళ్ళర్పిస్తోంది. తమ కుటుంబ సభ్యుడికి సంతాపసూచకంగా ఈ రోజు తెలుగు సినీ పరిశ్రమ బంద్‌ పాటిస్తోంది. ఇక ఏపీలో మార్నింగ్‌ షోలు రద్దు చేస్తున్నట్టు సినీ నిర్మాతలు ప్రకటించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి