iDreamPost

ఇండియా టూడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో పాల్గొన్న సీఎం జగన్!

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో చేసిన కృషి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా తిరుపతిలో జరిగిన ఇండియా టూడే ఎడ్యూకేషన్ సమ్మిట్ లో సీఎం జగన్ పాల్గొన్ని ఏపీలో అమలవుతున్న విద్యా సంస్కరణ గురించి వివరించారు.

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో చేసిన కృషి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా తిరుపతిలో జరిగిన ఇండియా టూడే ఎడ్యూకేషన్ సమ్మిట్ లో సీఎం జగన్ పాల్గొన్ని ఏపీలో అమలవుతున్న విద్యా సంస్కరణ గురించి వివరించారు.

ఇండియా టూడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో పాల్గొన్న సీఎం జగన్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి విద్యా, వైద్యానికి పెద్ద పీఠ వేశారు. ఇక ముఖ్యంగా విద్యా రంగంలో పెను మార్పులు తీసుకొచ్చారు. నాణ్యమైన విద్యను పిల్లలకు అందించడమే నిజమైన ఆస్తి అని సీఎం జగన్ బలంగా నమ్మారు. ఆ దిశగానే తాను అడుగులు వేసి విద్యార్థుల కోసం అనేక పథకాలను, కార్యక్రమాలను ప్రారంభించారు. నాడు-నేడు, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల  రూపు రేఖలు మార్చారు. ఇక తాజాగా తిరుపతిలో జరిగిన ఇండియా టూడే నిర్వహించిన ఎడ్యుకేషన్ సమ్మిట్ లో సీఎం జగన్ పాల్గొన్ని కీలక విషయాలను వెల్లడించారు. నాణ్యమైన విద్యను అందుకోవడం ప్రతీ ఒక్కరి హక్కుగా ఉండాలని ఆయన తెలిపారు.

బుధవారం సీఎం జగన్ తిరుపతిలో పర్యటించారు. తాడేపల్లి నుంచి బయల్దేరిని సీఎం జగన్  రేణుగుంట విమానాశ్రయంకి చేరుకున్నారు. అక్కడి నుంచి తాజ్ హోటల్ కి వెళ్లారు. అక్కడ  ఇండియా టూడే ఎడ్యుకేషనల్ సమ్మిట్ లో పాల్గొన్నారు.  ఇక ఈ సమ్మిట్ లో సీఎం జగన్ పాలనపై  ప్రశంలు కురిపించారు. ఏపీ విద్యారంగంలో తీసుకువచ్చిన నూతన విధానంపై ఇండియా టూడే సమ్మిట్ ప్రతినిధులు ప్రశంసించారు.  ఇక ఈ సమ్మిట్ లో ఏపీ విద్యారంగంలో తీసుకువచ్చిన నూతన విధానం, మన బడి, నాడు-నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరు ముద్ద, టోఫెల్ శిక్షణ వంటి అంశాలపై చర్చ జరిగింది.

ఇక సీఎం జగన్ తో సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్ దేశాయ్ చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజ్ దీప్ మాట్లాడుతూ.. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో విద్యపై సమ్మిట్ నిర్వహిచడం సంతోషంగా ఉందని  తెలిపారు. చదువుతో వచ్చే మార్పు ఏంటన్నది కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదని, ఏపీలో ఇప్పుడు ఆ మార్పే చోటు చేసుకోబోతుందని ఆయన తెలిపారు. ఏపీలోని అత్యంత సామాన్య విద్యార్థులు అమెరికాలోని వాషింగ్టన్ డీసీని పర్యటించడం గొప్ప విషయమని ఆయన ప్రశంసించారు.

ఇదే సమయంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇండియా టూడే జర్నలిస్టులు తిరుపతి లోని ప్రభుత్వ పాఠశాలలు చూడటం గొప్ప విషయమన్నారు. పేదరికం తొలగించేందుకు చదువుపై పెట్టుబడి పెట్టడం మినహా మరో మార్గం లేదన్నది తాను బలంగా నమ్ముతానని తెలిపారు. నాణ్యమైన  విద్యను అందుకోవడం ప్రతీ ఒక్కరి హక్కు కావాలని సీఎం తెలిపారు. పేదలు చదివేది ఒకటైతే, దనిక పిల్లలు చదివేది మరొకటని అన్నారు. గతంలో పేదలకు తెలుగు మీడియంలో బోధన జరిగేది,  డబ్బున్న వారి పిల్లలు ఇంగ్లీషులో చదివారని సీఎం తెలిపారు. అలాంటి స్థితిని పూర్తిగా మార్చేశామని ఆయన తెలిపారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్యాను అందించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ అడిగిన పలు అంశాల గురించి సీఎం జగన్ వివరించారు. ప్రభుత్వ పాఠశాల్లో చదువుకునే విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియాం ఇవ్వాలని భావించాం. పాఠ్య పుస్తకాల్లో ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లీష్ పెట్టాం. అలానే పాఠాశాలల అన్నింటిలోనూ సౌకర్యాలు మెరుగుపరిచాం. 62 వేల తరగతి గదులు ఉంటే..40 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ టీవీలు ఏర్పాటు చేశాం. ఈ నెలాఖరుకల్లా మిగతా చోట కూడా పూర్తవుతాయి. టీచర్లకు తగిన శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా ప్రణాళిలకు ఒక సమగ్ర రూపం తీసుకొచ్చాం. ఐబీ సిలబస్ మన రాష్ట్రం సెకండరీ ఎడ్యూకేషన్ బోర్డుతో చేతులు కలిపింది. జూన్ 2025 తర్వాత మొదటి తరగతిలో ఐబీ సిలబస్ ప్రవేశ పెడతాం. అక్కడి నుంచి దశల వారీగా ఏడో తరగతి వరకు ప్రవేశ పెడతాం. ఐదేళ్లలో మన రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో బ్యాక్యులరేట్ సర్టిఫెకేట్ కోసం పోటీ పడతారు. ఈ ప్రయత్నం ఎందుకంటే విద్యలో నాణ్యత అనేది చాల ముఖ్యం” అని సీఎం జగన్ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి