iDreamPost

YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. శ్రీ సత్యసాయి జిల్లాలో 5వ రోజు హైలెట్స్!

Memantha Siddham Day-5: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బస్సు యాత్ర సోమవారం ఐదో రోజు శ్రీ సత్య సాయి జిల్లాలో కొనసాగింది.

Memantha Siddham Day-5: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బస్సు యాత్ర సోమవారం ఐదో రోజు శ్రీ సత్య సాయి జిల్లాలో కొనసాగింది.

YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. శ్రీ సత్యసాయి జిల్లాలో 5వ రోజు హైలెట్స్!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సుయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.  ఈ యాత్ర మొత్తం 27 రోజుల పాటు కొనసాగనుంది. ఇప్పటికే కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాలో ఈ బస్సు యాత్ర పూరైంది. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి జనం నీరాజనాలు పలుకుతున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర శ్రీ సత్య సాయి జిల్లాలో కొనసాగుతోంది. మరి.. ఐదో రోజు బస్సు యాత్ర హైలెట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్ర  5వ రోజు సోమవారం శ్రీ సత్య సాయి జిల్లాలోని బత్తుల పల్లి నుంచి ప్రారంభమైంది.  ఉదయం 9 గంటలకు బత్తులపల్లి నుంచి ప్రారంభమైన ఈ బస్సుయాత్ర రామాపురం, కట్టకిందపల్లి, రాళ్ల అనంతపురం, ముదిగుబ్బ, ఎస్ఎస్ పీ కొట్టాల మీదుగా సాగింది. ధర్మవరం నియోజవర్గంలోని పలు ప్రాంతాల మీదుగా సీఎంజగన్ పర్యాటన సాగింది. కదిరికి చేరుకున్న అనంతరం పీవీఆర్ ఫంక్షన్ హాల్ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన   ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఇక ఈ బస్సుయాత్రలో  వైఎస్సార్ సీపీ  శ్రేణులు, ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. సంక్షేమ రథసారథి సీఎం జగన్ మోహన్ రెడ్డికి అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. ఐదో రోజు సాగిన మేమంత సిద్ధం యాత్రలో  సీఎం జగన్ సమక్షంలో  టీడీపీ నుంచి కీలక నేతలు వైఎస్సార్ సీపీలోకి చేరారు.  ఇక ఈ బస్సు యాత్రలో దారిపొడవునా ప్రజలు గజమాలతో సీఎం జగన్ కి అపూర్వ స్వాగతం పలికారు.

ఇక బస్సుయాత్రలో సీఎం జగన్ పలువురు వృద్ధులను కలిశారు. వారి సమస్యలను విని..నేను విన్నాను , నేను ఉన్నాను అంటూ భరోసా కల్పించారు. కాలే ఎండను సైతం లెక్క చేయకుండా జనం జగన్ కోసం ఎదురు చూశారు. సంజీవపురం స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో లేపాక్షి మాజీ ఎంపీపీ హానోక్, చంద్రదండు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అన్షార్ అహ్మద్ లో వైసీపీలో చేరారు. మధ్యాహం భోజన విరామం లేకుండా బస్సుయాత్ర కొనసాగింది. 2.50 నిమిషాలకు ముదిగుబ్బం చేరుకున్న సీఎం జగన్ 3.27 వరకు అంటే సుమారు 37 నిమిషాల పాటు ముదిగుబ్బలో జనంతో సీఎం జగన్ మమేకమయ్యారు. ముదిగుబ్బకు చేరుకున్న సీఎం జగన్.. అక్కడ ప్రజలకు అభివాదం చేశారు. అలానే మోటుకపల్లె మీదుగా జోగన్న పేట, ఎస్. ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెలో రాత్రి బసకు  చేయనున్నారు. మొత్తంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ఈ బస్సుయాత్ర ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయని పలువురు  రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి