iDreamPost

YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. తిరుపతి జిల్లాలో 8వ రోజు హైలెట్స్!

Memantha Siddham Day-8: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బస్సు యాత్ర గురువారం ఎనిమిదవ రోజు తిరుపతి జిల్లాలో కొనసాగింది.

Memantha Siddham Day-8: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బస్సు యాత్ర గురువారం ఎనిమిదవ రోజు తిరుపతి జిల్లాలో కొనసాగింది.

YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర..  తిరుపతి జిల్లాలో 8వ రోజు హైలెట్స్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమరంలో దూసుకెళ్తున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రను ప్రారంభించి ప్రజల్లోకి వెళ్లారు. సీఎం జగన్ చేపట్టిన ఈ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.  ఇప్పటికే  కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్య సాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఈ బస్సుయాత్ర విజయవంతంగా సాగింది. గురువారం ఎనిమిదవ రోజు  తిరుపతి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగింది. మరి.. ఎనిమిదవ రోజు మేమంత సిద్ధం యాత్ర వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

గురువారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర  ఎనిమిదవ రోజు తిరుపతి జిల్లాలో కొనసాగింది. ఈ యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. మేమంతా సిద్ధం యాత్రకు జనం పెద్ద సంఖ్యలో పాల్గొన్ని సీఎం జగన్ కి అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. గురువారం ఎనిమిదో రోజు బస్సు యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉదయం 9 గంటలకు గురవరాజుపల్లె యాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి మల్లవరం, ఏర్పేడు మీదగా పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ మీదగా చిన్న శింగమల సమీపంలో 11 గంటలకు లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో ముఖముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలతో తమ కుటుంబాలు బాగు పడుతున్నాయని ఆటో డ్రైవర్లు సీఎం జగన్ కి తెలిపారు. అనంతరం వారీ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. మరోసారి అధికారంలోకి వస్తే..  టిప్పర్ డ్రైవర్లకు రూ.10వేలు ఇస్తానని హామి ఇచ్చారు. అనంతరం ఏర్పేడు సీఎం జగన్ బస్సుయాత్ర చేరుకుంది.

ఏర్పేడు చౌరస్తా వద్దకు చేరుకున్న కార్యకర్తలు, అభిమానులు సీఎం జగన్ కు గజమాలతో స్వాగతం పలికారు.ఇక ఎద్దెల చెరువు వద్ద బస్సుయాత్రలో సీఎం జగన్ సమక్షంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్టువర్ధన్ రెడ్డి వైసీపీలో చేరారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తల, అనుచరులతో కలిసి ఆయన వైఎస్సార్ సీపీలో చేరారు. మండుటెండలోనూ శ్రీకాళహస్తిలో రోడ్డుకు ఇరువైపు లా మహిళలు సీఎం జగన్ కి ఘన స్వాగతం పలికారు. ఇక ఈ  యాత్రలో సీఎం జగన్ ప్రజలతో మమేకం అవుతూ వారికి అందుతున్న సంక్షేమంపై ఆరా తీశారు. ఇక తిరుపతి జిల్లాలో సాగిన సీఎం జగన్ బస్సుయాత్రలో సంక్షేమ పథకాలు, వివిధ రకాలుగా సాయం పొందిన వారు సీఎం జగన్ కి కలిసి ..తమ కృతజ్ఞతలు తెలియజేశారు. చిల్లకూరు చేరుకున్న సీఎం జగన్ కు పూలు చల్లుతూ, గజమాలతో ఆ గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు.

 సాయంత్రం 3.30 గంటలకు నాయుడుపేటలో నుంచి  చెన్నై జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన  పాల్గొన్ని ప్రసగించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అలానే చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో  ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆయన చేసిన మోసాలు ఇవ్వి అంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. మొత్తంగా చంద్రబాబుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సభ అనంతరం మనుబోలు, నెల్లూరు బైపాల్ మీదుగా చింతరెడ్డిపాలెం చేరుకుని అక్కడ రాత్రికి బస చేయనున్నారు. ఇలా ఎనిమిదవ రోజు సీఎం జగన్ పర్యటన తిరుపతి జిల్లాలో విజయవంతంగా సాగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి