iDreamPost

వెయ్యి రోజులు.. ఎన్నో అద్భుతాలు.

వెయ్యి రోజులు.. ఎన్నో అద్భుతాలు.

‘నేను ఎనిమిది నెల‌ల 13 రోజులు అధికారంలో ఉన్నాను. ఎనిమిది నెల‌లు అధికారంలో ఉంటే ఏమేం చేయొచో చేసి చూపించాను.’ అంటూ ఓ సినిమాలో హీరో చెప్పిన‌ట్లుగా.. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వెయ్యి రోజుల‌కే వైఎస్ జ‌గ‌న్ ఎన్నో అద్భుతాలు చేసి చూపించారు. ల‌క్ష‌లాది మందికి ఆర్థిక చేయూత అందించారు. ల‌క్ష‌లాది మందికి సొంతింటి క‌ల నెర‌వేర్చారు. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అమ్మ ఒడి, జగనన్న తోడు, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ బీమా, మనబడి నాడు-నేడు, ఆరోగ్యశ్రీ, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాకానుక, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ వాహన మిత్ర.. ఇలా ఎన్నో వినూత్న ప‌థ‌కాల ద్వారా ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోయారు జ‌గ‌న్.

మరోవైపు వెయ్యి రోజుల పాలనలో సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయాలు, ఇంటింటికీ రేషన్ సరఫరా చేసే వాహనాలను ప్రవేశపెట్టడం జగన్ పాలనలో మైలురాళ్లు. ఏపీలో జిల్లాల పున‌ర్విభ‌జ‌న తాజాగా మ‌రో చ‌రిత్ర‌. ఉగాది నాటికి కొత్త జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. అటు ఇటీవల మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు అసెంబ్లీ సాక్షిగా జగన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో విశాఖ కేంద్రంగా ఏపీ రాజధానిని ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ వెయ్యి రోజుల పాలనలో ప్ర‌జ‌ల‌పై సంక్షేమ పథకాల జల్లు కురిసింది. కొవిడ్‌ సమయంలోనూ ఏ పథకాన్నీ ఆపకుండా కొనసాగించారు. ప్ర‌ధానంగా విద్య‌, వైద్య రంగంలో వ‌చ్చిన మార్పులు మ‌హాద్భుతం.

రేప‌టి త‌రాలైన విద్యార్థుల భ‌విష్య‌త్ కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ‌ట్టి పునాది వేశారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను స‌మూలంగా మార్చేశారు. నాడు-నేడుతో తొలి దశలో 3,669 కోట్లతో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేశారు. కార్పొరేట్ స్కూళ్లలో టీసీలు తీసుకుని విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ల వైపు మ‌ళ్లేలా చేసిన ఘ‌న‌త ఆయ‌న‌దే. నాడు-నేడు కింద స్కూళ్లలో ఫర్నిచర్, నీటివసతి, రక్షిత తాగునీరు, పెయింటింగ్స్‌..గ్రీన్‌ చాక్‌ బోర్డ్‌, ఇంగ్లీష్ ల్యాబ్‌, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, ప్రహరీ గోడ, వంటగది నాడు-నేడుతో ప్రతి స్కూల్‌లో ఇంగ్లీష్‌ ల్యాబ్‌ కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 47.32 లక్షల మంది విద్యార్ధులకు 731.30 కోట్లతో ‘జగనన్న విద్యాకానుకస అంద‌జేస్తున్నారు. అమ్మ ఒడి మ‌రో బృహ‌త్త‌ర ప‌థ‌కం.

క‌రోనా స‌మ‌యంలో ఏపీ ప్ర‌భుత్వం అందించిన సేవ‌ల‌పై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రిగింది. ఆ రీతిలో సేవ‌లు అందాయంటే వైద్య రంగం బ‌లోపేతానికి స‌ర్కారు చేసిన కృషిని తెలుసుకోవ‌చ్చు. అంతేకాదు.. క‌రోనా నేప‌థ్యంలో ఎదురైన స‌వాళ్ల‌ను దృష్టిలో ఉంచుకుని.. రాష్ట్రంలో హెల్త్ హ‌బ్‌లు ఏర్పాటు చేస్తోంది. ప్రజలు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ వైద్యానికి ఎందుకు వెళ్లాల్సి వస్తోందన్నది ఆలోచించాల‌ని అధికారుల‌కు సూచించి, రాష్ట్రంలోనే మెరుగైన సేవ‌ల‌ను అందించేందుకు అడుగులు వేశారు. జిల్లా కేంద్రాలతోపాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రి కలుపుకుని మొత్తం 16 చోట్ల హెల్త్‌ హబ్‌ల ఏర్పాటుకు అడుగులు ప‌డుతున్నాయి. ఒక్కో చోట కనీసంగా 30 నుంచి 50 ఎకరాలలో వీటిని నిర్మించ‌నున్నారు. వైసీపీ స‌ర్కారు వ‌చ్చాకే వేల కోట్ల రూపాయ‌లు వైద్య రంగంపై ఖ‌ర్చు పెడుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి