iDreamPost

కాంగ్రెస్ గెలిస్తే ‘ధరణి’ బంగాళాతానికే: CM KCR

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. ప్రతి పక్షాలపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్ లో జరిగిన సభలో కేసీఆర్.. కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు.

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. ప్రతి పక్షాలపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్ లో జరిగిన సభలో కేసీఆర్.. కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ గెలిస్తే ‘ధరణి’ బంగాళాతానికే: CM KCR

తెలంగాణలో ఎన్నికల వాతావరణం ఓ రణరంగాన్ని తలపిస్తుంది. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు  ప్రచారాల్లో బిజీబిజీగా ఉన్నాయి. ప్రధాన పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ.. బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఇక గులాబీ బాస్ కేసీఆర్ అయితే గేర్ మార్చి.. ఏకంగా రోజుకు నాలుగు ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఈక్రమంలోనే నేడు మెదక్, బోధన్ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై, ముఖ్యంగా కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో గులాబీ బాస్ విరుచకపడ్డారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే ధరణి బంగాళాఖాతానికి.. రైతులు అరేబియా సముద్రంలోకి వెళ్తారని కేసీఆర్ అన్నారు. ఆ పార్టీని గెలిపిస్తే దళారీ రాజ్యం వస్తుందన్నారు. తెలంగాణ ప్రజల కోసమే భారాస కృషి చేస్తోందని కేసీఆర్ చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు.  ఆయన మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో నిజాంసాగర్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం ముంచిందని, దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్వ వైభవం తెచ్చిందన్నారు. రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎప్పుడైనా రైతుబంధు గురించి ఆలోచన చేసిందా? అని కేసీఆర్ ప్రశ్నించారు.

ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని, రైతుబంధు దుబారా అని కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శిస్తున్నారు. రైతుబంధు దుబారానా?ధరణి తీసేస్తే రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లోకి ఎలా వస్తాయి?కేసీఆర్ ప్రశ్నించారు. రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌ దుబారా అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ అంటున్నారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్‌ గెలిస్తే రైతులకు 3 గంటల కరెంటుతో సరిపెడతారు. అభ్యర్థుల గుణగణాలను ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలి. విచక్షణతో ఓటు వేసి సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కేసీఆర్‌ అన్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో కూడా ప్రజా ఆశీర్వాద సభను బీఆర్ఎస్ నిర్వహించింది. ఈ సభలో కూడా సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేశారు. గత పాలకులు ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేదు. బీడీ కార్మికుల కష్టాలు స్వయంగా చూశానని, తన చిన్నతనంలో బీడీ కార్మికుల ఇళ్లల్లో పెరిగానని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ బీడీ కార్మికులకు పింఛన్‌ ఇవ్వట్లేదని, సంక్షేమ పథకాల్లో దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉన్నామని కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్‌ రైతుబంధు తీసేస్తామని అంటోంది. 24 గంటల నిరంతర విద్యుత్‌ అనవసరం అంటోందన్నారు. మరి.. కేసీఆర్ చేసిన ప్రసంగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి