iDreamPost

బాబు కూలగొట్టారు.. జగన్‌ కడుతున్నారు..

బాబు కూలగొట్టారు.. జగన్‌ కడుతున్నారు..

విజయవాడ కృష్ణా నది తీరంలో 9 ఆలయాలను తిరిగి నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌.. ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు.

ఈ ఆలయాలను కృష్ణా నది పుష్కరాల సమయంలో నాటి చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసింది. విజయవాడ నగరం, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో దాదాపు 40 ఆలయాలను నాటి సీఎం చంద్రబాబు కూల్చివేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా ఆలయాలను తిరిగి నిర్మిస్తామని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు. చెప్పిన మాట ప్రకారం సీఎం జగన్‌.. ఈ రోజు తొలి విడతలో 9 ఆలయాలను పునర్‌ నిర్మించేందుకు భూమి పూజ చేశారు.

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా నాటి టీడీపీ ప్రభుత్వం కృష్ణా తీరంలో ఆలయాలను తొలగించింది. ఈ విషయంపై నాడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ మౌనం వహించింది. ఇటీవల దేవాలయాలపై గుర్తు తెలియని దుండగులు చేసిన దాడులుపై నానా యాగీ చేస్తున్న బీజేపీ నేతలు.. నాడు చంద్రబాబు ప్రభుత్వం కావాలని దేవాలయాలను కూల్చివేసినా.. దేవతామూర్తుల విగ్రహాలను మున్సిపల్‌ చెత్తబండిలో తరలించినా.. కనీసం విచారం వ్యక్తం చేయలేదు. బీజేపీతోపాటు చంద్రబాబుకు నాడు స్నేహితుడుగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ కూడా దేవాలయాల కూల్చివేతపై పల్తెత్తి మాట మాట్లాడలేదు. చంద్రబాబు కూల్చివేసిన దేవాలయాలను నేడు తిరిగి నిర్మిస్తోన్న సీఎం జగన్‌పై మాత్రం పవన్‌ కళ్యాణ్‌ విమర్శలు చేస్తున్నారు. 18 నెలలుగా ఎందుకు నిర్మించలేదనే తర్కం లేని విమర్శలు పవన్‌ చేస్తుండడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి