iDreamPost

CM జగన్ మంచి మనసు.. ఆయన చొరవతో హెలికాప్టర్‌లో గుండె తరలింపు!

అవయవదానం చాలా మందికి తిరిగి ప్రాణం పోస్తుంది. అయితే వాటిపై సరైన అవగాహన లేక.. చావు బతుకుల్లో ఉన్నా, బ్రెయిన్ డెడ్ అయినా రోగుల నుండి అవయవాలు సేకరించేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రారు. కానీ ఓ ఆసుపత్రి అవగాహన కల్పించడంతో పాటు.. సీఎం జగన్ చొరవతో..

అవయవదానం చాలా మందికి తిరిగి ప్రాణం పోస్తుంది. అయితే వాటిపై సరైన అవగాహన లేక.. చావు బతుకుల్లో ఉన్నా, బ్రెయిన్ డెడ్ అయినా రోగుల నుండి అవయవాలు సేకరించేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రారు. కానీ ఓ ఆసుపత్రి అవగాహన కల్పించడంతో పాటు.. సీఎం జగన్ చొరవతో..

CM జగన్ మంచి మనసు.. ఆయన చొరవతో హెలికాప్టర్‌లో గుండె తరలింపు!

ఒక మనిషి మరణించిన తర్వాత కూడా జీవించడం అనేది.. కేవలం అవయవదానం వలన మాత్రమే సాధ్యమౌతుంది. శరీరం నుంచి ప్రాణం వేరైన తర్వాత ఆ శరీరం పాడైపోతుంది. కానీ, కొంత సమయం లోపు గుండె, కళ్ళు, కిడ్నీలు ఇలా కొన్ని అవయవాలను శరీరం నుంచి వేరు చేసి.. అవసరం ఉన్న వారికి వాటిని అమర్చవచ్చు. ఇలా అవయవదానం చేయడం వలన చనిపోయిన వారు.. చావు బ్రతుకుల్లో ఉన్న వారికి పునర్జన్మను ప్రసాదించిన వారవుతారు. అవయవదానం చేయాలన్న అవగాహన, ఆలోచనే కాదూ పెద్ద మనస్సు కూడా ఉండాలి మృతి చెందిన కుటుంబాలకు. ఇప్పుడు అవయవదానికి ముందుకు వచ్చి మంచి మనస్సు చాటింది శ్రీకాకుళంలోని ఓ కుటుంబం. అయితే సీఎం జగన్ చొరవతో కేవలం అతి తక్కువ సమయంలో ఈ అవయవాలను తరలించడం సాధ్యపడింది.   పూర్తి వివరాల్లోకి వెళ్తే..

శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలం.. రాయవలసకు చెందిన వ్యక్తి పొట్నూరు రాజేశ్వరరావు (62). ఆయన మెదడులో రక్తశ్రావo జరిగిన కారణంగా ఈనెల 14న జెమ్స్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. గత ఐదు రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. రాను రానూ అతడి ఆరోగ్యం క్షీణించ సాగింది. వైద్యానికి రాజేశ్వరరావు ఏ మాత్రం స్పదించడం లేదు. దీనితో వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా గుర్తించారు. వెంటనే, ఆయన కుటుంబ సభ్యులకు అవయవదానంపైన అవగాహన కల్పించారు. రాజేశ్వరరావు భార్య, కుమారుడు అవయవదానానికి అంగీకరించడంతో.. వైద్యులు జీవన్ ధాన్ కు అప్లై చేశారు. అందుకు తగిన ఏర్పాట్లు వెంట వెంటనే జరిగిపోయాయి. అవయవదానానికి ఆ వ్యక్తి గుండె, లివర్ పనిచేస్తాయని వైద్యులు గుర్తించారు. మంగళవారం రాజేశ్వరరావు నుంచి అవయవాలను సేకరించారు. అవి ఎవరికైతే అవసరమో వారికి అమర్చేందుకు వాటిని తరలించారు. తిరుపతి లోని స్విమ్స్ ఆసుపత్రికి గుండెను తరలించగా, విశాఖ లోని ఓ ప్రైవేట్( పినాకిల్)హాస్పిటల్ కి లివర్ ను తరలించారు.

అయితే, అవయవాలను మనిషి శరీరం నుంచి తొలగించిన తర్వాత.. వాటిని నిర్ణీత సమయంలోపు అవసరమైన వ్యక్తికి అమర్చాలి. ఎంత త్వరగా ఈ పనిని చేయగలిగితే.. ఆ అవయవాల పని తీరు అంత బాగా ఉంటుందని వైద్యులు తెలిపారు. ఒకవేళ నిర్ణీత సమయం దాటితే అవి పనిచేయవు. దానితో పాటు వాటికోసం పడిన శ్రమ అంతా వృధాగా పోతుంది. ఓ వ్యక్తి శరీరం నుండి గుండెను వేరు చేసిన తర్వాత కేవలం 4గo.ల నుండి 6 గo.లు లోగా వేరే వ్యక్తికి అమర్చాల్సి ఉంటుంది. అందుకే, ఇలా అవయవాలను ఓ ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించేటపుడు ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా జాగ్రత్త పడతారు. కొన్ని సార్లు రోడ్ మార్గమే కాకుండా ఎయిర్ లైన్స్ లోను ఈ తరలింపు కొనసాగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో రాజేశ్వరరావు గుండెను తిరుపతికి తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ ను సిద్దం చేసింది. సీఎం జగన్ ఆదేశాలతో జెమ్స్ హాస్పిటల్ ప్రాంగణం లోనే హెలిప్యాడ్ ఏర్పాటు చేసి..కేవలం 20 నిమిషాల్లోనే గుండెను హెలికాప్టర్ లో శ్రీకాకుళం నుండి విశాఖ ఎయిర్ పోర్ట్ కి తరలించారు. అక్కడ నుండి ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్లో తిరుపతికి తరలించారు. ఇక లివర్ ను రోడ్డు మార్గం ద్వారా విశాఖకు తరలించారు.

కాగా, తరలించిన ఆ వ్యక్తి గుండెను పేషెంట్ లహరి(11)కి అమర్చనున్నారు. లహరి తెలంగాణకు చెందిన చిన్నారి. గత రెండు నెలలుగా హైదరాబాద్ లోని ఆసుపత్రిలో.. గుండె సంబంధిత వ్యాధి కారణంగా చికిత్స పొందుతుంది. ఈ విషయమై లహరి తండ్రి మాట్లాడుతూ ఇప్పటివరకు చికిత్స కోసం దాదాపు మూడు లక్షలు ఖర్చు చేశాము. కానీ, ఆ ఆసుపత్రిలో ఎటువంటి ప్రయోజనం లేదు. తెలంగాణ కంటే ఏపీలో వెంటనే రెస్పాన్స్ లభించింది. అంటూ.. చెప్పుకొచ్చారు. కాగా, జెమ్స్ హాస్పిటల్ నుంచి కేవలం గత 30 రోజుల వ్యవధిలో ముగ్గురు అవయవదానాల ప్రక్రియ జరిగింది. ఈ హాస్పిటల్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం నాలుగు బ్రెయిన్ డెడ్ కేసులలో .. ఇటువంటి అవయవదానాలు జరిపించారు.

ఇక మంగళవారం అవయవదానం చేసిన రాజేశ్వరరావుకు జెమ్స్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది.. నివాళులు అర్పించారు. బ్రెయిన్ డెడ్, ఇతర కారణాల వలన చనిపోతూ ఉంటారు. వారు ఎలానో తిరిగి బ్రతికే అవకాశం లేదు. కాబట్టి, వారి అవయవాలను అవసరం ఉన్న వారికి అమర్చడం వలన.. .చావు బ్రతుకులలో ఉన్న వారికి మేలు చేసినట్లు అవుతుంది. మరి, గుండె తరలింపు విషయమై సీఎం జగన్ తీసుకున్న ప్రత్యేక శ్రద్దపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి