iDreamPost

CM Jagan: ట్రాక్టర్ నడిపిన సీఎం, వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ప్రారంభం

CM Jagan: ట్రాక్టర్ నడిపిన సీఎం, వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ప్రారంభం

వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ప్రారంభ కార్యక్రమంలో చాలా విశేషాలు క‌నిపించాయి. ఒక‌ప‌క్క రైతుల‌కు ట్రాక్ట‌ర్లు, కోత యంత్రాల‌ను పంపిణీ చేస్తూనే, రైతు గ్రూపుతో కలిసి సీఎం వైఎస్‌ జగన్‌ ట్రాక్టర్‌ను నడిపారు. గుంటూరు జిల్లా, చుట్టగుంట వైఎస్సార్‌ యంత్ర సేవ పథకం రాష్ట్రస్థాయి మెగా మేళాలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్‌ కోత యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక రైతు గ్రూపుతో కలిసి సీఎం జగన్‌ స్వయంగా ట్రాక్టర్‌ను నడిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్‌ కోత యంత్రాల పంపిణీతోపాటు 5,262 రైతు గ్రూపు బ్యాంక్‌ ఖాతాలకు, రూ.175.61 కోట్ల సబ్సిడీని సీఎం బటన్‌ నొక్కి జమ చేశారు.

వైయస్సార్‌ యంత్రసేవాపథకం రాష్ట్ర స్ధాయి మెగా పంపిణీలో భాగంగా 3800 ఆర్బీకే స్ధాయి యంత్రసేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 320 క్లస్టర్‌ స్ధాయి యంత్ర సేవా కేంద్రాలకు 320 కంబైన్‌ హార్వెస్టర్ల పంపిణీ చేశారు.

10,750 రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయం ఇంకా మెరుగుపరిచేందుకు, రైతుకు కావాల్సిన పనిముట్లన్నీ కూడా ఆ రైతు భరోసా కేంద్రాల్లోనే, అదే గ్రామాల్లోనే తక్కువ ధరలోనే వారికి అందుబాటులో వచ్చేందుకు రైతులతోనే గ్రూపులు ఏర్పాటు చేసి, ఆ రైతులకే ప్రభుత్వం తరపున 40 శాతం రాయితీ ఇస్తున్నామ‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు.

రూ.2016 కోట్లతో, ప్రతి ఆర్బీకే స్ధాయిలోనూ రూ.15 లక్షలు విలువతో 10,750 వైయస్సార్‌ యంత్రసేవా కేంద్రాలను ఎర్పాటుచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామ‌ని, వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కోక్కటి రూ.25 లక్షలు విలువ గల కంబైన్ హార్వెస్టర్లతో, 1615 క్లస్టర్‌ స్ధాయి యంత్రసేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయబోతున్నామ‌ని ప్ర‌క‌టించారు సీఎం జ‌గ‌న్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి