iDreamPost

కన్నా ఆరోపణలో క్లారిటీ మిస్!!

కన్నా ఆరోపణలో క్లారిటీ మిస్!!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలివితక్కువ వారు మేము ఏది చెప్పినా నమ్ముతారు అనే భ్రమ ఇన్నిరోజులు తెలుగుదేశం పార్టి అధినేత చంద్రబాబుకే ఉండేది అనుకునే వారు కానీ తాజాగా ఈ కోవలోకి రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా వచ్చి చేరినట్టు కనిపిస్తున్నారు. వై.యస్ జగన్ ప్రభుత్వం విశాఖను పరిపాలన రాజధాని గా ఎంపిక చేస్తు ప్రకటన చేయగానే, బిజేపి అధిష్టానం తమ అభిప్రాయం తెలపక ముందే రాష్ట్రంలో జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు ప్రకటన చేసి చంద్రబాబు నిర్ణయానికి మద్దతు ఇస్తు అందరిని ఆశ్చర్యపరిచారు కన్నా లక్ష్మీ నారాయణ. అయితే జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతించడం, ఆ తరువాత భారతీయ జనతా పార్టి అధిష్టానం రాజధానుల విషయంలో మేము కలగచేసుకోము అని చెప్పడంతో వెనక్కు తగ్గినట్టు కనిపించారు లక్ష్మినారాయణ.

ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశానికి రాజగురువుగా చెప్పుకునే రామోజీ రావును కలిసిన తరువాత మళ్ళీ ఆయనలో జగన్ పై నిందలు మోపాలనే ఉత్సాహం పెరిగినట్టు కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ జగన్ పై రాయలసీమ ప్రాంతమైన పులివెందుల ప్రాంతంపై విద్వేషపూరితంగా మాట్లాడుతూ ఆ ప్రాంతాన్ని అత్యంత దారుణంగా కించపరుస్తూ వ్యవహరించిన తీరుతో ఆ ప్రాంత వాసులు తెలుగుదేశం పార్టీకి గట్టి బుద్ది చెప్పారు అని సీమ తెలుగుదేశం నాయకులే ఒప్పుకునే వాస్తవం. తెలుగుదేశం నేతలు ద్వారా విషం చిమ్ముతుంతే నమ్మరనే వాస్తవం గ్రహించిన తెలుగుదేశం అధిష్టానం ఇప్పుడు ఆ విషం చిమ్మే సంసృతి రాజగురువు ద్వారా కన్నాకు అప్పచెప్పారేమో అనిపిస్తుంది.

గత పాలనలో విశాఖలొ అంతులేని భూకబ్జాలు జరిగాయని ఆ పార్టీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడే పత్రికా ముఖం గా చెప్పారు. మీకు విశాఖలో స్థలం ఉండి మీరు విజయవాడ లొ కూర్చుంటే మీ స్థలం మాయం అవుతుందని ఆనాడు శాసన సభలో బి.జే.పి శాసన సభ్యులు విష్ణు కుమార్ రాజు అన్నారు. చంద్రబాబు పాలనలో విశాఖలో భూ కబ్జాలు ఇంత దారుణంగా జరిగితే ఏనాడు మాట్లాడని కన్నా లక్ష్మినారాయణ జగన్ ప్రభుత్వంలో మాత్రం కబ్జాలు జరుగుతున్నాయి అని చెప్పటం వెనక ఉన్నది రామోజి స్క్రిప్టే అని బహిరంగ రహస్యం.

ఇక తాజాగా కన్నా ఒక అడుగు ముందుకు వేసి నిన్న మీట్ ద మీడీయా సమావేశంలో మాట్లాడుతు జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. వై.సి.పి నేతలు విశాఖ చేపలుప్పాడు లో తనకి ఉన్న భూమిని కబ్జా చెయడానికి ప్రయత్నించారని అయితే ఆ స్థలం పక్కనే ఉన్న ఒక పోలీసు అధికారి సమాచారం మేరకు నా మనుషులు వెళ్ళి అది కన్నా గారిది అని చెప్పగా ఆ స్థలాన్ని విడిచి వెళ్లారని, ఇలా నేతల స్థలాలకే విశాఖలో రక్షణ లేకుండా పోతే ఇక సామాన్యుల స్థలాల పరిస్థితి ఏంటని ప్రశించారు.

ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ చేసిన ఆరోపణలను పరిశీలించి చూస్తే పొంతన కుదరడం లేదు. నిన్న మీడియా సమావేశంలో 1993లో విశాఖ చేపలుప్పాడలో స్థలం కొన్నాను అది వైసీపీ నేతలు కబ్జా చేయబోయారని చెప్పారు. కానీ నిజానికి గత ఎన్నికలకి సంబంధించి కన్నా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో ఇప్పుడు చెప్తున్న కన్నా స్థలం ఎక్కడా పేర్కొనలేదు. దీంతో వైసీపీపై బురదజల్లడానికే లేనిస్థలాన్ని ఉన్నట్టు చూపిస్తున్నారా లేక స్థలం ఉన్నా ఎన్నికల అఫిడవిట్ లో చూపించకుండా అక్రమ ఆస్తులుగా దాచుకున్నారా అనే మౌలిక ప్రశ్న ఎదురవుతుంది. అలాగే దీనికి సంబంధించి నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం తప్ప పోలీసులకి పిర్యాదు చేసిన ఆధారాలు కూడా నిన్న ప్రెస్ మీట్ లో చూపించలేదంటే అందులో ఉన్న నిజానిజాలేంటో కన్నాకే తెలియాలి. ఇవన్నీ బేరీజు వేసుకుని చూస్తే వైసీపీపై బురద జల్లడానికే ఈ ఆరోపణలు కన్నా చేస్తున్నారా అని అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.. దీనికి కన్నా లక్ష్మినారాయణ క్లారిటీ ఇస్తారో లేదో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి