iDreamPost

AAY రేషన్‌ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

  • Published Apr 09, 2024 | 1:06 PMUpdated Apr 09, 2024 | 1:06 PM

రాష్ట్రంలో అంత్యోదయ అన్నయోజన రేషన్ కార్డులు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై రాష్ట్రంలో రేషన్ బియ్యంతో పాటు దానిని కూడా పంపీణీ చేయాలని ప్రభుత్వం అదేశాలను జారీ చేసింది.

రాష్ట్రంలో అంత్యోదయ అన్నయోజన రేషన్ కార్డులు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై రాష్ట్రంలో రేషన్ బియ్యంతో పాటు దానిని కూడా పంపీణీ చేయాలని ప్రభుత్వం అదేశాలను జారీ చేసింది.

  • Published Apr 09, 2024 | 1:06 PMUpdated Apr 09, 2024 | 1:06 PM
AAY రేషన్‌ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

దేశంలోని ఎటువంటి శాశ్వత ఆదాయ వనరులు లేని పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అన్న యోజన పథకం కింద.. ఈ అంత్యోదయ ఆహార రేషన్ కార్డులను జారీ చేసింది. అయితే ఈ అంత్యోదయ ఈ రేషన్ కార్డు ఉన్నవారికి ప్రతి నెలా 35 కిలోల బియ్యంతో పాటు గోధుమలు, చక్కెర చౌక ధరకే లభిస్తుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రల్లో ఈ అంత్యోదయ రేషన్ కార్డు ఉన్నవారికి అతి తక్కువ ధరకే అనగా.. సబ్సిడీ ధరతో అవసరమైన ఆహార ధాన్యాలను ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అంత్యోదయ అన్నయోజన కింద రేషణ్ కార్డు ఉన్నవారికి తెలంగాణ రాష్ట్రం ఓ తీపి కబురును అందజేసింది. ఇకపై రేషన్ బియ్యంతో పాటు దానిని కూడా పంపీణీ చేయాలని ప్రభుత్వం అదేశాలను జారీ చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

అంత్యోదయ అన్నయోజన రేషన్ కార్డులు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై రాష్ట్రంలో రేషన్ బియ్యంతో పాటు చక్కెర కూడా పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ తాజాగా ఆదేశాలను జారీ చేసింది. ఎందుకంటే.. ఏఏవై కార్డుదారులకు చక్కెర పంపిణీ చేసేందుకు పలువురు రేషన్‌ డీలర్లు ఆసక్తి చూపించటం లేదు. అలాగే చాలామంది డీలర్లు ఇప్పటికే డీడీలు కట్టట్లేదు. ఇక డీడీలు కట్టినవారిలో కొందరు ఇంకా చక్కెర రాలేదని కార్డుదారులకు సాకులు చెబుతున్నారు. అయితే ఈ విషయం పౌరసరఫరాల శాఖ దృష్టికి వెళ్లడంతో.. తాజాగా పౌరసరఫరాల శాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇక నుంచి జిల్లాలవారీగా అవసరమైనంత చక్కెర తీసుకుని, ఏఏవై కార్డుదారులకు పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5.99 లక్షల మంది ఏఏవై రేషన్‌కార్డుదారులు ఉన్నారు. అలా కార్డుకు కిలో చొప్పున ప్రతి నెలా 599 టన్నుల చక్కెర అవసరం ఉంటుంది. ఈ మేరకు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో చక్కెర నిల్వలు ఉండాలి. ఇక డీలర్లు డీడీలు కట్టి.. కార్డులకు కేటాయింపుల మేరకు చక్కెర తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే తెలంగాణ వ్యాప్తంగా 17,235 మంది డీలర్లు ఉండగా.. ఈ నెల 1వ తేదీ నుంచే బియ్యం సరఫరా మొదలైంది. అయినా చాలా దుకాణాల్లో చక్కెర మాత్రం ఇంకా పంపిణీ చేయటం లేదు. అందుకోసం బియ్యం, గోధుమలు, చక్కెరల్లో  అసలు ఏమి ఇచ్చారు, ఎంతి ఇచ్చారు..  అనేది కార్డుదారులకు డీలర్లు ప్రింట్‌ ఇవ్వాలి. కానీ, చాలా రేషన్‌ దుకాణాల్లో ఈ ప్రింట్లు కూడా ఇవ్వటం లేదు. కొందరు డీలర్లు అయితే  బియ్యంతో సరిపెట్టి చక్కెరను పంపీణీ చేయకుండా.. పక్కదారి పట్టిస్తున్నరనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక మార్కెట్ లో చక్కెర ధర రూ.40-45 వరకు ఉండగా.. అంత్యోదయ కార్డుదారులకు సబ్సిడీపై కిలో చక్కెర రూ.13.50లకే అందించాలి. ఇక డీలర్లు సక్రమంగా చక్కెర సరఫరా చేస్తే పేదలకు మేలు జరగనుంది.మరీ,  అంతద్యోయ రేషన్ కార్డుదారుల కోసం రాష్ట్రం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి