iDreamPost

సీఐడీ మరో నోటీసు.. ఉమా మెంటల్‌గా ఫిక్స్‌ అయ్యారు..!

సీఐడీ మరో నోటీసు.. ఉమా మెంటల్‌గా ఫిక్స్‌ అయ్యారు..!

ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాటలను వక్రీకరిస్తూ, తిరుపతి ఉప ఎన్నికల సమయంలో ఫోర్జరీ వీడియోను ప్రదర్శించిన టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ప్రెస్‌మీట్‌లో వాడిన సెల్‌ఫోన్, ట్యాబ్‌లను గురువారం విచారణ సందర్భంగా దేవినేని ఉమా తీసుకురాకపోవడంతో మరోసారి సీఐడీ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. తొలిసారి జారీ చేసిన నోటీసుల్లోనే ఫోన్, ట్యాబ్‌ తీసుకురావాలని స్పష్టంగా సీఐడీ పేర్కొన్నా.. దేవినేని వాటిని వెంట తీసుకువెళ్లలేదు.

మీడియా సమావేశంలో ఉపయోగించిన సెల్‌ఫోన్, ట్యాబ్‌లను తీసుకుని రావాలంటూ సీఐడీ జారీ చేసిన నోటీసుపై మరోసారి కోర్టును ఆశ్రయించాలని దేవినేని ఉమా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్‌కు అనుబంధంగా మరో పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల వేళ చేసిన విమర్శలు, ఆరోపణలు ఎన్నికలతోపాటే పోతాయని భావించిన ఉమాకు ఊహించని చిక్కులు ఎదురవుతున్నాయి.

ఈ వ్యవహారంలో అరెస్ట్‌ ఖాయమనే భావనలో దేవినేని ఉన్నట్లు ఆయన తీరుతో తెలుస్తోంది. నిన్న దాదాపు ఏడుగంటల పాటు సీఐడీ విచారణ చేసింది. ఫోన్, ట్యాబ్‌ తీసుకెళితే ఈ రోజు మళ్లీ మరో నోటీసు ఇవ్వాల్సిన అవసరం సీఐడీకి వచ్చి ఉండేది కాదు. కానీ దేవినేని వాటిని కావాలనే తన వెంట తీసుకెళ్లలేదు. అవి సీఐడీకి దొరికితే నేరం బయటపడుతుందని దేవినేనికి తెలుసు. ఆ వీడియో ఫోన్, ట్యాబ్‌లోకి ఎలా వచ్చింది…? ఎవరు..? ఎక్కడ తయారు చేశారు..? అనే సాకేంతిక అంశాలు సీఐడీకి అధికారులకు లభిస్తాయి. అందుకే ఈ కేసులో వీడియో ప్రదర్శించిన ఫోన్, ట్యాబ్‌ అంత్యంత కీలకంగా మారాయి.

నిన్న గురువారం సీఐడీ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన దేవినేని.. తనకు మరోసారి నోటీసులు ఇస్తారని చెప్పడం, రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమంటూ మాట్లాడారు. ధూళిపాళ్ల మాదిరిగా తనను కూడా రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పంపాలని చూస్తున్నారంటూ మాట్లాడారు. ఈ కేసులో తాను జైలుకు వెళ్లక తప్పదని దేవినేనికి స్పష్టమైనట్లుంది. అందుకే ఆయన మానసికంగా సిద్ధమైనట్లు ఉమా వ్యాఖ్యలతో అర్థమవుతోంది. సీఐడీ నోటీసులకు అనుగుణంగా తాను ఉపయోగించిన ఫోన్, ట్యాబ్‌లను దేవినేని ఉమా అధికారులకు అందిస్తారా..? లేదా కోర్టు ద్వారా రక్షణ పొందుతారా..? అనేదే ఈ కేసులో ప్రస్తుతం ఆసక్తికర అంశం.

Also Read : ఆరోపణ చేస్తే అతికినట్లుండాలి ఉమా..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి