iDreamPost

Chris Gayle: ఆ మూడు దేశాలే క్రికెట్ ను నాశనం చేస్తున్నాయి! గేల్ సంచలన వ్యాఖ్యలు..

  • Author Soma Sekhar Published - 06:01 PM, Fri - 30 June 23
  • Author Soma Sekhar Published - 06:01 PM, Fri - 30 June 23
Chris Gayle: ఆ మూడు దేశాలే క్రికెట్ ను నాశనం చేస్తున్నాయి! గేల్ సంచలన వ్యాఖ్యలు..

క్రిస్ గేల్.. వరల్డ్ క్రికెట్ లో విధ్వంసకర బ్యాటర్లలో ఒకడిగా పేరుగాంచాడు. ఐపీఎల్ ద్వారా తన పేరును ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగించాడు. అతడు క్రీజ్ లో ఉన్నాడంటే.. ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టాల్సిందే. బౌలర్ ఎవరన్నది చూడడు గేల్. అయితే బ్యాటింగ్ కు దిగితే ఏ రేంజ్ లో బాదుతాడో.. అప్పుడప్పుడు అదే రేంజ్ లో విమర్శలు చేస్తుంటాడు. తాజాగా మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు. ప్రముఖ వార్త పత్రిక పీటీఐతో మాట్లాడుతూ..” ప్రపంచ క్రికెట్ ను ఆ మూడు దేశాలే నాశనం చేస్తున్నాయి” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరి గేల్ చెప్పినట్లుగా క్రికెట్ ను నాశనం చేసే ఆ మూడు దేశాలు ఏవి? అవి ఎలా నాశనం చేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచ క్రికెట్ లో భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టీమ్ లు పెద్ద జట్లుగా పేరెన్నికగన్నాయి. ఈ ఈ జట్ల బోర్డులు కూడా డబ్బులో ఉన్నతమైనవని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దాంతో ఈ మూడు జట్లే వరల్డ్ క్రికెట్ ను శాసిస్తున్నాయంటూ క్రిస్ గేల్ మండిపడ్డాడు. ప్రముఖ నేషనల్ ఛానల్ తో గేల్ మాట్లాడుతూ..”ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లే ఎక్కువగా టెస్ట్ మ్యాచ్ లు ఆడుతున్నాయి. దాంతో చిన్న జట్లకు సంవత్సరం పొడుగూత టోర్నీలే ఉండటం లేదు. ఇలాగే కొనసాగడం టెస్ట్ క్రికెట్ కు అలాగే క్రికెట్ కు మంచిది కాదు. క్రికెట్ నాశనం అవ్వడానికి ఈ మూడు జట్లే కారణం. ఇది మంచి పద్దతి కాదు. గత కొన్ని సంవత్సరాలుగా క్రికెట్ లో ఎన్నో మార్పులు వచ్చాయని, ప్రస్తుతం క్రికెట్ ఓ వ్యాపారంగా మారింది. దాంతో అన్ని క్రికెట్ బోర్డులు డబ్బులు ఎలా సంపాదించాలి? ఎంత సంపాదించాలన్న ఆలోచనతోనే ఉన్నారని” క్రిస్ గేల్ విమర్శించాడు.

ఈ క్రమంలోనే టీ20లే కాకుండా టెస్ట్ ల ద్వారా కూడా బోర్డులకు మంచి ఆదాయం వస్తుందని గేల్ చెప్పుకొచ్చాడు. ఇక వెస్టిండీస్, జింబాబ్వే, బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్లకు ఎక్కువ టోర్నీలు పెట్టడం ద్వారా.. వారు కూడా క్రికెట్ లో ఎదుగుతారని అభిప్రాయపడ్డాడు గేల్. ఇక పెద్ద టీమ్ లోని ఆటగాళ్లకు చెల్లించే జీతాలు, చిన్న టీమ్ లోని ఆటగాళ్లకు చెల్లించడం లేదని, ఇది ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీస్తుందని గేల్ పేర్కొన్నాడు. ఇక మహీళా క్రికెటర్లకు కూడా పురుష క్రికెటర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం గేల్ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి