iDreamPost

చిట్టగాంగ్ వీరుడు సూర్యసేన్

చిట్టగాంగ్ వీరుడు సూర్యసేన్

నేడు ప్రముఖ విప్లవకారుడు చిట్టగాంగ్ (ప్రస్తుత బంగ్లాదేశ్) వీరుడు సూర్యసేన్ అలియాస్ మాస్టర్ దా 86వ వర్ధంతి. భారత దేశానికి బ్రిటీష్ బానిస సంకెళ్ళ నుండి విముక్తి కలిగించడానికి ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడినా సరైన గుర్తింపు రాక మరుగునపడిపోయారు అలా మరుగున పడిన స్వతంత్ర సమర యోధులలో వీరు ఒకరు.

సూర్యసేన్ 1916 లో బి.ఏ చదువుతున్న రోజులలో తన అధ్యాపకుల నుండి స్వతంత్ర పోరాటం గురించి తెలుసుకుని విప్లవ పోరాటానికి ఆకర్షితుడై అప్పటి ప్రముఖ విప్లవ సంస్థ అయిన అనుశాలిని సమితిలో చేరి తన చదువు ముగియగానే 1918 లో చిట్టగాంగ్ లోని నేషనల్ స్కూల్ లో టీచర్ గా చేరారు. విద్యార్ధులకి స్వతంత్ర పోరాటం గురించి చెబుతు కొంతమంది విద్యార్ధులని చేరదీసి 1930 ఏప్రిల్ 18 న చిట్టగాంగ్ బ్రిటీష్ ఆయుధగారం పై దాడి చేసి కమ్యూనికేషన్ వ్యవస్థని ద్వంసం చేసి ఆ ఆయుధ గారం పై జాతీయజండా ని ఎగురవేసి బ్రిటీష్ సేనలకి సవాలు విసరడంలో విజయం సాదించి ఎందరికో స్పూర్తిగా నిలిచారు.

జలాలాబాద్ కొండలలో తలదాచుకున్న వీరిని బ్రిటిష్ సేనలు పసిగట్టి దాడి చేసినా విజయవంతంగా తిప్పికొట్టి అక్కడనుండి తప్పించుకుని మారువేషాలలో తిరుగుటూ స్వతంత్ర పోరాట యోధులని తయరు చేయటంలో లీనమయ్యారు. ఒక మిత్రుని గృహములో తలదాచుకోగా ఆ మిత్రుడు నమ్మకద్రోహిగా మారి సూర్యసేన్ గారి ఆచూకి బ్రిటిష్ సేనలకి తెలపగా అనుకోని ఈ సంఘటనతో 1933 ఫిబ్రవరిలో బ్రిటిష్ సేనలకి చిక్కి 12 జనవరి 1934 ఉరితీయ బడ్డారు. దీనికి ముందు వారి గోర్లని పీకడం, సుత్తితో పళ్ళుని రాల కొట్టటం రెండు భుజముల ఎముకలని విరిచేయటం వంటి దారుణమైన చిత్రహింసలు బ్రిటీష్ సేనలు పెట్టారు.

చనిపోయే ముందు సూర్యసేన్ గారు మిత్రునికి రాసిన లేఖ లో ” చావు నా ముంగిట ఉంది స్వతంత్ర భారతం అనే నా కలని మీరు ముందుకి తీసుకు వెళ్తారని ఆశిస్తున్నాను” అని రాసి తన దేశ భక్తి ని తెలియచేశారు ఇలాంటి గొప్ప యోధులని నేటి తరం స్మరించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి