iDreamPost

వీడియో: భారత పర్యాటకులపై బంగ్లాదేశీయుల రాళ్ల దాడి!

Indian Tourists: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన జాప్లాంగ్ వద్ద రాళ్లదాడి జరిగింది. ఆ ప్రాంతాన్ని చూసేందుకు వచ్చిన భారతీయులపై బంగ్లాదేశీయులు రాళ్ల దాడి చేశారు. పెద్ద సంఖ్యలో బంగ్లాదేశీయులు భారతీయులపై రాళ్లదాడికి పాల్పడ్డారు.

Indian Tourists: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన జాప్లాంగ్ వద్ద రాళ్లదాడి జరిగింది. ఆ ప్రాంతాన్ని చూసేందుకు వచ్చిన భారతీయులపై బంగ్లాదేశీయులు రాళ్ల దాడి చేశారు. పెద్ద సంఖ్యలో బంగ్లాదేశీయులు భారతీయులపై రాళ్లదాడికి పాల్పడ్డారు.

వీడియో: భారత పర్యాటకులపై బంగ్లాదేశీయుల రాళ్ల దాడి!

భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద పర్యాటకుల పై రాళ్ల దాడి జరిగింది. జాప్లాంగ్ సరిహద్దు వద్ద భారతీయ పర్యాటకులపై బంగ్లాదేశ్ పర్యాటకులు రాళ్లదాడి చేశారు. జాప్లాంగ్ కొండ ప్రాంతంలోని ఓ నది వద్ద భారతీయ పర్యటకులు వచ్చారు. ఈక్రమంలో అక్కడే ఉన్న బంగ్లాదేశ్ పర్యాటకులు భారత యాత్రికులపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దాడి ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

భారత్, బంగ్లాదేశ్ మధ్య సరిహద్దుగా జాప్లాంగ్ కొండ ప్రాంతం పర్యాటకంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వీసా లేకుండానే ఇరుదేశాల యాత్రిలుకు వస్తుంటారు. అలానే ఆదివారం వచ్చింది అంటే చాలు..పర్యాటకుల తాకిడి బాగా ఉంటుంది. ఇరు దేశాలకు చెందిన పర్యాటకులు ఈ పర్యాటక స్థలంకి వచ్చి సరదాగా గడుపుతుంటారు. అలానే తాజాగా కూడా కొందరు భారతీయులు జాప్లాంగ్ ప్రాంతానికి పర్యటనకు వచ్చారు. రాళ్ల దాడి ఘటన చోటుచేసుకున్న ఘటన అందరినీ కలిచివేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

ఇక వీడియోను చూసినట్లు అయితే కొంతమంది బంగ్లాదేశ్ పర్యాటకులు భారతీయ యాత్రికులపై రాళ్లు రువ్వడం స్పష్టంగా కనిపించింది. ఈ సంఘటన వెనుక కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. అసలు ఏ కారణంతో భారతీయులపై రాళ్ల దాడి చేశారన్నది తెలియాల్సి ఉంది. తాజాగా జరిగిన ఈఘటన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అలాగే, పర్యాటకులు పర్యాటక ప్రదేశాన్ని సందర్శించకుండా కూడా నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయని పలువురు చెబుతున్నారు.

ఈ ఘటనను సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనల్లు తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ పర్యాటకులు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఇరు దేశాల మధ్య పర్యాటక రంగంపై ప్రభావం చూపుతుందని పలువురు చూపుతున్నారు. మరి..భారతీయులపై బంగ్లాదేశీయులు చేసిన రాళ్ల దాడి ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి