iDreamPost

ఆచార్య ఎఫెక్ట్ – మెగా మార్పులు

ఆచార్య ఎఫెక్ట్ – మెగా మార్పులు

భారీ అంచనాలతో విడుదలై అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిన ఆచార్య ఎఫెక్ట్ రాబోయే మెగా సినిమాల మీద పడుతోంది. చిరంజీవి ఉన్నంత మాత్రాన టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు గుడ్డిగా ఓపెనింగ్స్ ఇవ్వరని అర్థమైపోయింది. ఆఖరికి రామ్ చరణ్ క్రేజ్ కూడా ఆచార్యకు కొంచెం కూడా ఉపయోగపడకపోవడం షాక్ కలిగించే అంశం. సుమారు 80 కోట్ల దాకా నష్టం మూటగట్టుకున్న ఆచార్య ఓన్లీ తెలుగు వెర్షన్ ప్రకారం బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. అజ్ఞాతవాసి, బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి ఆల్ టైం డిజాస్టర్స్ ని దాటేసి ఫస్ట్ ప్లేస్ తీసుకుంది. ఈ నెల 20నే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ ఉండొచ్చనే టాక్ ఉంది. ఇంకొద్దిరోజుల్లో తెలుస్తుంది.

ఇదిలా ఉండగా చిరంజీవి విదేశాల నుంచి రాగానే ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు స్క్రిప్ట్ లను మరోసారి పునః పరిశీలిస్తారని ఇన్ సైడ్ టాక్. గాడ్ ఫాదర్ చివరి దశలో ఉంది కాబట్టి అందులో మార్పులు చేయడానికి లేదు. అభిమానులు ప్రకటన నుంచే భయపడుతున్న భోళా శంకర్ ని మరోసారి విశ్లేషిస్తారట. అసలే అది ఊర మాస్ రొటీన్ కంటెంట్. అజిత్ వేదలమ్ రీమేక్ అని అనౌన్స్ చేసినప్పుడే ఇది ఎందుకని ప్రశ్నించిన అభిమానులే ఎక్కువ. పైగా ఆ మధ్య రజినీకాంత్ పెద్దన్నలో చేసిన క్యారెక్టర్ కి ఇందులో కీర్తి సురేష్ పాత్రకు చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. పూర్తిగా చేంజ్ చేయడం సాధ్యం కాదు కానీ చిరు మనసులో ఏముందో చూడాలి.

మొత్తానికి రౌడీలకు పాఠాలు నేర్పాల్సిన ఆచార్య తనే స్వంతంగా నేర్చుకోవాల్సి రావడం విశేషం. కేవలం తన ఇమేజ్ ఒకటే వసూళ్లు తేలేదని మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టు కేవలం ఫ్యాన్స్ నే దృష్టిలో పెట్టుకుంటే లాభం లేదని అర్థమైపోయింది. గాడ్ ఫాదర్ ఇంకొద్ది భాగం ఉంటె అయిపోతుంది. ఆగస్ట్ 12 విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఒకవేళ భోళా శంకర్ ను పెండింగ్ లో పెడదాం అనుకుంటే వాల్తేర్ వీరయ్యను వేగవంతం చేస్తారు. బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ ఒక కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్, క్యాథరిన్ త్రెస్సా హీరోయిన్లు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి