iDreamPost

చిరు బాలయ్య బాక్సాఫీస్ ఢీ ?

చిరు బాలయ్య బాక్సాఫీస్ ఢీ ?

బాక్సాఫీస్ వద్ద ఎందరు హీరోలు పోటీ పడినా చిరంజీవి బాలకృష్ణ తలపెడితే ఆ కిక్కే వేరు. థియేటర్ల వద్ద సందడి, అభిమానుల కోలాహలం, ఎవరు గెలిచారన్న చర్చలు వెరసి అదో రకమైన సందడికి వేదికగా మారుతుంది. ఈ ఇద్దరూ చివరి సారి క్లాష్ అయ్యింది ఖైదీ నెంబర్ 150, గౌతమి పుత్ర శాతకర్ణిలతో. ఇక్కడ మెగాస్టార్ దే పై చేయి అయ్యింది కానీ బాలయ్య కూడా మంచి విజయం అందుకున్నాడు. ఈ కాంబో యుద్ధం గురించి మాట్లాడాల్సి వస్తే ఇప్పటి జనరేషన్ కు వెంటనే గుర్తొచ్చేది మృగరాజు, నరసింహనాయుడుల ముఖాముఖీనే. అంచనాలను తలకిందులు చేస్తూ ఫలితాలు తారుమారు కావడం ఫాన్స్ అంత సులభంగా మర్చిపోలేరు.

ఇప్పుడీ ప్రస్తావన రావడనికి కారణం మరోసారి ఈ ఢీ తప్పేలా లేదు. ఆచార్య, అఖండలు రెండూ దసరాను టార్గెట్ చేసుకుని దానికి తగ్గట్టు ప్లానింగ్ లో ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. ఆగస్ట్ లో ఎలాగూ వచ్చే ఛాన్స్ లేదు. సెప్టెంబర్ లోనూ పరిస్థితులు అంత అనుకూలంగా ఉంటాయన్న గ్యారెంటీ లేదు. పోనీ 2022 సంక్రాంతి అనుకుంటే ఇప్పటికే నలుగురు లాక్ చేసుకున్నారు. డిసెంబర్ లో కెజిఎఫ్ 2 వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ లేదా నవంబర్ రెండు ఛాన్సులు మాత్రమే ఉంటాయి. దీపావళి కన్నా దసరా బెటర్ ఆప్షన్. తెలుగు ఆడియన్స్ పరంగా వర్కౌట్ అయ్యే సీజన్ ఇదే.

అందుకే ఆచార్య అఖండల మధ్య నువ్వా నేనా పోటీ తప్పకపోవచ్చని అంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య చిట్టచివరి స్టేజిలో ఉంది. దాదాపు పూర్తయినట్టే. అఖండ తమిళనాడులో క్లైమాక్స్ షూట్ జరుపుకుంటోంది. అది అవ్వగానే బోయపాటి శీను గుమ్మడి కాయ కొట్టేస్తారు. సో ఎలా చూసుకున్నా మెగా నందమూరి అభిమానులు పక్కపక్క థియేటర్లలో కలుసుకోవడం తప్పేలా లేదు. కరోనా థర్డ్ వేవ్ వార్తల నేపథ్యంలో పెద్ద సినిమాల నిర్మాతలు సెప్టెంబర్ ని సైతం రిలీజులకు అనుకూలంగా పరిగణించడం లేదు. ఈ కారణంగా భారీ క్లాషులు చూడాల్సి రావడం ఖాయమే. చూద్దాం ప్రకటనలు ఎప్పుడు వస్తాయో

Also Read: చరణ్ ప్రాజెక్ట్ కోసం జెట్ స్పీడ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి