iDreamPost

Acharya & F3 : ఆచార్య ఎఫ్3 – మార్పు తప్పదా ?

Acharya & F3 : ఆచార్య ఎఫ్3 – మార్పు తప్పదా ?

ముందు చెప్పుకున్న ఖచ్చితమైన రిలీజ్ డేట్లకు ఎవరూ కట్టుబడే పరిస్థితులు కనిపించడం లేదు. ఇవాళ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన ఎఫ్3 పోస్టర్, వీడియో టీజర్ రెండింటిలోనూ విడుదల తేదీని తీసేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో 2022 ఫిబ్రవరి 25న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ సంగతి ప్రస్తావించకుండా ప్రోమోలు కట్ చేయడం చూస్తే పోస్ట్ పోన్ ఉండొచ్చేమోనన్న ప్రచారానికి బలం చేకూరింది. రెండు వేల రూపాయల నోట్లతో గాలి వీచుకుంటున్న సీన్ ని చూపించి ఫ్యాన్స్ కి మంచి కానుకే ఇచ్చారు కానీ పైన చెప్పిన ట్విస్టు కూడా ఉంది.

చిరంజీవి ఆచార్య సైతం ఫిబ్రవరి 4 రాకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ లో జోరుగా సాగుతోంది. కొన్ని కీలకమైన సన్నివేశాలు రీ షూట్ చేస్తే బెటరని దర్శకుడు కొరటాల శివ అభిప్రాయపడటంతో మెగాస్టార్ సైతం అంగీకారం తెలిపారని అంటున్నారు. ఇందులో నిజమెంతుందో తెలియదు. కాకపోతే రామ్ చరణ్ కాంబినేషన్ సన్నివేశాలు రీ షూట్ అవసరం లేదట. ఒకవేళ ఇది వాస్తవం అయితే మళ్ళీ చేస్తారా లేదన్నది చూడాలి. ఆర్ఆర్ఆర్ వచ్చిన నెలలోపే రామ్ చరణ్ రెండో సినిమా రావడం అభిమానుల కోణంలో స్పెషలే కానీ ఇది కరెక్టా కాదా అనే మీమాంసలో కొణిదెల సంస్థ చర్చిస్తున్నట్టు తెలిసింది. ఇంకో నెలాగితే క్లారిటీ రావొచ్చు.

అఖండ వసూళ్లు ఇచ్చిన నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని నిర్మాతలందరూ తమ సినిమాల విడుదలకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడి కూడా ఎదురవుతోంది. పుష్ప రిలీజ్ ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉండగా ఫైనల్ డిటిఎస్ మిక్సింగ్ ఇంకా అవ్వలేదన్న వార్త బన్నీ ఫ్యాన్స్ ని టెన్షన్ కు గురి చేస్తోంది. రాధే శ్యామ్ కూడా ప్రెజర్ లోనే ఉంది. మొత్తానికి కరోనా లాక్ డౌన్ అయిపోయింది జనాలు థియేటర్లకు బాగా వస్తున్నారని ఆనందించే లోపే ఒమిక్రాన్ ఆందోళన ఒక వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల ఉరుకులు పరుగులు మరో వైపు టాలీవుడ్ ని మళ్ళీ భయానికి గురి చేస్తోంది

Also Read : Radhe Shyam : బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం భారీ ప్లాను

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి