iDreamPost

కేంద్రం ప్రకటనకు చంద్రబాబు స్వీయ అర్థం..

కేంద్రం ప్రకటనకు చంద్రబాబు స్వీయ అర్థం..

రాష్ట్ర రాజధానులను ఆ రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చని. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదంటూ నిన్న మంగళవారం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో చేసిన ప్రకటనకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త అర్థం చెప్పారు. ఈ రోజు అమరావతిలో రైతు ఆందోళన సభలో ఆయన రైతులనుద్ధేశించి మాట్లాడారు.

రాజధానిని నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని.. కానీ రాజధానిని మార్చే అధికారం లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అసలు మూడు రాజధానులు పెట్టే అధికారమే లేదన్నారు. కానీ సీఎం జగన్‌.. సౌత్‌ ఆఫ్రికా మోడల్‌ అంటూ.. లక్ష కోట్ల ఆదాయం వచ్చే అమరావతిని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఎకరం 15 కోట్ల విలువైన సంపద కళ్ల ముందటే కోల్పోతుంటే.. చాలా బాధేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏకతాటిపై ఉండి పోరాటం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. ఒకే మాట.. ఒకే రాజధాని అనే మాటపై నిలబడి ఉండాలని కోరారు. ధైర్యంగా పోరాడాలని సూచించారు. రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి