iDreamPost

చంద్రబాబుకు సుప్రీంలోను నో రిలీఫ్.. అప్పటి వరకు జైల్లోనే!

మాజీ ముఖ్యమంత్రికి సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబుకు సంబంధించిన పలు కేసులు వివిధ కోర్టులో విచారణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు పైబర్ కేసును వాయిదా వేసింది.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబుకు సంబంధించిన పలు కేసులు వివిధ కోర్టులో విచారణలో ఉన్నాయి. అసలు దేశంలో ఎక్కడ, ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు కేసుల విచారణలు సాగుతున్నాయి. క్వాష్ పిటిషన్, మరికొన్ని పిటిషన్లు సుప్రీం కోర్టులో విచారణలో ఉన్నాయి. అందులో ఒకటైన ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడగా.. మరోసారి కూడా వాయిదా పడింది. నవంబర్‌ 9కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ బోస్, త్రివేది ధర్మాసనం తెలిపింది.

ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.  ఫైబర్‌ నెట్‌ కేసులో తన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు ఈ నెల 9న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం పలుమార్లు వాయిదా వేయగా.. తాజాగా మరోసారి నవంబర్ 9కి వాయిదా వేసింది. అలాగే క్వాష్ పిటిషన్‌పై తీర్పును వచ్చే నెల 8న వెల్లడిస్తామని ధర్మాసనం తెలిపింది. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుపై తీర్పు తర్వాత ఫైబర్‌ నెట్‌ కేసు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీం కోర్టు తెలిపింది. అప్పటి వరకు పీటీ వారెంట్‌పై ఇచ్చిన తీర్పును యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది.

పైబర్ నెట్ కేసులో సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు చంద్రబాబును అరెస్ట్ చేయబోమని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. మరోవైపు ఈ కేసులో విచారించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని సీఐడీ తరఫు న్యాయవాదులు కూడా కోర్టులో వాదించారు. చంద్రబాబును అరెస్ట్ చేయడానికి మాత్రం వీల్లేదని సీఐడీ, ఏపీ పోలీసులను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కాగా సుప్రీం నిర్ణయంతో బాబుకు స్వల్ప ఊరట దక్కినట్లయ్యింది. మరోవైపు చంద్రబాబు రిమాండ్ ను నవంబర్ 1 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి.. సుప్రీం కోర్టులో, ఏసీబీ కోర్టులో చంద్రబాబు కేసులో వచ్చిన తీర్పులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి