iDreamPost

Chandrababu Naidu: చంద్రబాబుకి లోకువైన జనసేన.. తెలంగాణలో ఏం జరిగిందో చూశారుగా అంటూ

  • Published Dec 12, 2023 | 12:20 PMUpdated Dec 12, 2023 | 12:20 PM

వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తుండగా.. తాజాగా చంద్రబాబు వారిని అవమానించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆ వివరాలు..

వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తుండగా.. తాజాగా చంద్రబాబు వారిని అవమానించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆ వివరాలు..

  • Published Dec 12, 2023 | 12:20 PMUpdated Dec 12, 2023 | 12:20 PM
Chandrababu Naidu: చంద్రబాబుకి లోకువైన జనసేన.. తెలంగాణలో ఏం జరిగిందో చూశారుగా అంటూ

రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని.. కూటమిగా ముందుకు వెళ్లాలని టీడీపీ, జనసేన పార్టీలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అవినీతి కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబును కలవడానికి వెళ్లిన పవన్ ములాఖత్ తర్వాత.. రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయని.. పొత్తు ఉంటుందని తెలిపారు. అయితే పవన్ నిర్ణయం సొంత పార్టీ నేతలకు చాలా మందికి నచ్చలేదు. కొందరు బహిరంగంగానే విమర్శించారు. పొత్తు నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారిపై పవన్ మండిపడ్డాడు. టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని.. ఈ నిర్ణయం నచ్చని వారు పార్టీ నుంచి వెళ్లి పోవచ్చు అంటూ బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాక టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనాలని జనసేన కార్యకర్తలకు పిలుపు నిచ్చాడు.

టీడీపీతో పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్.. కనీసం సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వచ్చినా తట్టుకోలేకపోతున్నాడు. జనసైనికులకే వార్నింగ్ ఇస్తున్నాడు. కానీ గ్లాస్ పార్టీతో పొత్తు అంశంలో చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతల తీరు సరిగా లేదని జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు అంటున్నారు. తమకు కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదని.. ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ.. టీడీపీతో పొత్తు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఇక తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. జనసేన కార్యకర్తలను అవమానించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

టీడీపీ నిర్వహించే కార్యక్రమాలన్నింటికి జనసేన కార్యకర్తలు హాజరు కావాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసందే. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు నాయుడు నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన జనసేన కార్యకర్తలు.. తమ పార్టీ జెండాను పైకెత్తి పట్టుకున్నారు. అది గమనించిన చంద్రబాబు.. బాబు జెండాలు దించు.. వాటిని తగ్గిస్తేనే మంచిది అంటూ చురకలు వేశారు. అంతేకాక మిడిసి పడితే ఎలా ఉంటుందో మొన్న తెలంగాణలో చూశాం కాదా అంటూ.. ఎద్దేవా చేశారు.

అంటే పరోక్షంగా తెలంగాణలో పోటీ చేసిన ప్రతి చోటా కనీసం డిపాజిట్ కూడా దక్కలేదని ఈ సందర్భంగా గుర్తు చేసి.. మరోసారి అవమానించాడు చంద్రబాబు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని అవమానాలు పొందుతూ.. పొత్తులో కొనసాగడం అవసరమా.. అని ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై జనసేన నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి