iDreamPost

విచారణ అంటే భయం? చేసిన తప్పులు చూపించేది ఎలా చంద్రబాబు?

విచారణ అంటే భయం? చేసిన తప్పులు చూపించేది ఎలా చంద్రబాబు?

అన్నిటికీ ప్రభుత్వం మీద నిందలు వేసి పబ్బం గడుపుకోవాలని అనుకోవడం చంద్రబాబు నైజంగా మారుతోంది. ప్రతిదానికి కోర్టు గడప మెట్లు ఎక్కి, కేసుల నుంచి బయటపడి పోవాలి అన్న తాపత్రయం ఉన్న బాబు కేసులను ఎదుర్కోవాలని ఏమాత్రం ఆలోచించరు. కేసులను ఎదుర్కొని, విచారణను స్వీకరిస్తేనే అసలు నిజాలు బయట పడతాయి. అయితే ఏదైనా అంశం లో చంద్రబాబు అండ్ కో మీద కేసు నమోదు అయిన వెంటనే హై కోర్టుకు వెళ్లడం వారికి ఆనవాయితీగా మారింది.

అమరావతి ఉద్యమం గా టిడిపి, ఓ వర్గం మీడియా చిత్రీకరించే రైతులు దీక్షలు 500 రోజుకు చేరిన సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా అనిపిస్తున్నాయి. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటున్నారు. ఏ చట్ట ప్రకారం తప్పు జరిగిందో చెప్పమంటే చెప్పడం లేదు. సీఐడీ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారు.. అంటూ చంద్రబాబు విమర్శించారు. అసలు తప్పు జరిగిందో లేదో విచారణ జరిగితే తెలుస్తుంది. కానీ ప్రభుత్వానికి, వ్యవస్థలకు కనీసం అవకాశం ఇవ్వకుండా హైకోర్టుకు వెళ్లి ప్రతిసారి స్టేలు తెచ్చుకుంటుంది చంద్రబాబే.

తమపై ప్రభుత్వం లేదా వ్యవస్థలు పెట్టిన కేసులను ఎదుర్కొని చంద్రబాబు ఈ మాట అంటే బాగుండేది. కోర్టులో కేసులు వేయకుండా విచారణ ఎదుర్కొని, దర్యాప్తునకు సహకరించి అప్పటికి ప్రభుత్వం ఏమీ ఆధారాలు చూపకుండా ఉంటే చంద్రబాబు ఏమన్నా సహేతుకంగా ఉండేది. అలా కాకుండా కేసులు పెట్టిన ప్రతిసారి దానికి రాజకీయ రంగు పులిమి, తప్పించుకోవాలని చూడడం చంద్రబాబు అండ్ కో కు అలవాటు గా మారింది. చంద్రబాబు నేర్పిన సంప్రదాయాన్ని ఆ పార్టీ నేతలు కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నారు.

Also Read : ఆరోపణ చేస్తే అతికినట్లుండాలి ఉమా..!

అమరావతి భూముల కొనుగోలు విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది ప్రభుత్వ వాదన. ప్రస్తుతం దీని మీద భారత అత్యున్నత న్యాయస్థానంలో విచారణ సైతం జరుగుతోంది. దీనిపై విచారణ ఎదుర్కోవాల్సిన చంద్రబాబు దానిని తప్పించుకునేందుకు వేసిన ఎత్తులు అన్నీ ఇన్నీ కావు. న్యాయ వ్యవస్థను అడ్డుగా పెట్టుకుని ఆయన ఇప్పటివరకూ 27 కేసుల్లో విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకున్న చరిత్ర ఉంది.

ఇప్పటివరకు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లోనే ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే పదం ఉన్నప్పటికీ, అమరావతి భూముల విషయంలో నూ ముందుగా రాజధాని ఎక్కడ వస్తుందో కొందరికి లీకులు ఇచ్చి, భూములు భారీగా కొనుగోలు చేశారు అన్నది ప్రధాన ఆరోపణ. దీనికి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లోని ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం కంటే పెద్ద పదమే పెట్టాలి. దీనిని నిజాయితీగా నిబ్బరంగా ఎదుర్కోకుండా విచారణను అడ్డుకునేందుకు అన్ని మార్గాలను వెతికారు. ఆఖరికి సుప్రీం వరకు వెళ్లారు.

చంద్రబాబు అనుసరించిన పద్ధతినే తాజాగా ఆ పార్టీ నాయకులు అనుసరిస్తున్నారు. ప్రభుత్వం లేదా వ్యవస్థలో ఓ కేసు నమోదు చేసినప్పుడు ఓ నేరం తాలూక విచారణ ఎదుర్కోవాల్సిని టిడిపి నాయకులకు వెంటనే కోర్టులకు వెళ్తున్నారు. యరపతినేని దగ్గర నుంచి మొన్న దూళిపాళ్ల నరేంద్ర వరకూ ఇప్పుడు తాజాగా దేవినేని ఉమా అందరిదీ ఒకటే పంధా. తమపై వచ్చిన నేరారోపణలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వెంటనే వారికి కోర్టులు గుర్తుకు వస్తాయి. కనీసం తమ పై విచారణ కూడా వద్దని, వాదనలు మొదలవుతాయి.

ప్రజాజీవితంలో ఉన్న వారు ఒక ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని ధీటుగా ఎదుర్కోవలసి ఉంది పోయి, కోర్టులకు వెళ్లి దానిని మరింత సంక్లిష్టం చేసి బయట పడాలి అనుకోవడం చంద్రబాబు నేర్పిన విద్య. ఇప్పుడు దానినే టిడిపి నాయకులు అంతా అనుసరిస్తున్నారు. అయితే బయట మాత్రం చంద్రబాబు తాను ఏమీ ఎరగనట్లు ప్రభుత్వం మీద నిందలు వేసి, ప్రభుత్వం తమను వేధిస్తోందని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేయడమే విడ్డురంగా ఉంది.

Also Read : చంద్ర‌బాబు దిద్దు”బాట” ప‌డుతున్నారా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి