iDreamPost

మహిళా సీఈవో ప్రాణం తీసిన టెస్లా కారు.. ఏం జరిగిందంటే

  • Published Mar 11, 2024 | 1:56 PMUpdated Mar 11, 2024 | 1:56 PM

సహజంగా కొన్నిసార్లు చేసే చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. తాజాగా ఇలాంటి చిన్న పొరపాటు చేయడం వలన ఓ ప్రముఖ సంస్థకు చెందిన మహిళ సీఈవో విషయంలో ఏం జరిగిదంటే..

సహజంగా కొన్నిసార్లు చేసే చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. తాజాగా ఇలాంటి చిన్న పొరపాటు చేయడం వలన ఓ ప్రముఖ సంస్థకు చెందిన మహిళ సీఈవో విషయంలో ఏం జరిగిదంటే..

  • Published Mar 11, 2024 | 1:56 PMUpdated Mar 11, 2024 | 1:56 PM
మహిళా సీఈవో ప్రాణం తీసిన టెస్లా కారు.. ఏం జరిగిందంటే

సాధారణంగా కొన్నిసార్లు చేసే చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. ఇక ఆ ప్రమాదాలు అనేవి ఆస్తి నష్టం అయినా, ప్రాణ నష్టం అయిన కావచ్చు. అందుచేత ప్రతి విషయంలో ప్రతి క్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రమాదం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. రెప్పపాటు నిర్లక్ష్యం ప్రాణాలను బలిగొంటుంది. తాజాగా చైనాలోని సంపన్న వర్గానికి చెందిన ఓ మహిళా సీఈఓ.. క్షణ నిర్లక్ష్యంతో వ్యవహరించి చేసిన పనికి ఆమె ప్రాణాలే పొగొట్టుకుంది. అది కూడా తానే స్వయంగా నడుపుతున్న టెస్లా కారు వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆమె చేసిన అతి చిన్న తప్పు వల్ల ఆమె ప్రాణాలనే విడిచింది.ఆ వివరాళ్లోకి వెళ్తే..

కారు మోడ్‌ను పొరబాటున మార్చడంతో ఓ సంస్థకు చెందిన మహిళ సీఈఓ ప్రాణాలు కోల్పోయిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని ప్రముఖ షిప్పింగ్‌ కంపెనీ ఫార్‌మోస్ట్‌ గ్రూప్‌ కు చెందిన‌ సీఈవో ఏంజెలా చావో (50) పొరపాటున కారును రివర్సు మోడ్‌లో మార్చి ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈమె చైనా నూతన సంవత్సర సందర్భంగా.. గత నెల ఆమె ఫ్రెండ్స్‌తో కలిసి టెక్సాస్‌లోని ఆస్టిన్‌ సమీపంలో తన గెస్ట్‌హౌస్‌కి వెళ్లారు.అక్కడ దాదాపు 900 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ఫామ్‌హౌస్ పక్క నుంచి మిల్లర్‌ సెలయేరు కూడా ఉంది.అయితే, అక్కడ నుంచి సమీపంలోని ఓ రెస్టారెంట్ కు వెళ్లి రాత్రి వరకు ఉండి తిరిగి ఇంటికి వెళ్లడానికి బయల్దేరారు. ఈ క్రమంలోనే.. ఓ చోట త్రీపాయింట్ టర్న్ వచ్చింది. దానిని దాటే క్రమంలో.. ఏంజెలా పొరపాటున తన టెస్లా ఎక్స్‌ ఎస్‌యూవీను రివర్స్‌ మోడ్‌లోకి మార్చారు. దీంతో అతి వేగంగా వెనక్కి వెళ్లి టెస్లా కారు అక్కడ ఉన్న చెరువులో బోల్తాపడింది. వెంటనే భయంతో ఏంజెలా తన స్నేహితురాలికి ఫోన్‌ చేశారు. కానీ, వాహనం తిరగబడటంతో వేగంగా నీటిలో మునిగిపోయింది.

ఇక సంఘటన స్థలంలోకి చెరుకున్న ఆమె స్నేహిుతరాలు, గెస్ట్ హౌస్ మేనేజర్‌, పోలీసులు అక్కడికి చేరుకొని ఏంజెలాను రక్షించేందుకు చాలా ప్రయత్నించారు. కానీ, ఆమె టెస్లా కారు అత్యంత బలమైన గ్లాస్‌ విండో కారణంగా దానిని బద్దలు కొట్టడం అసాధ్యంగా మారింది. దీనికి తోడు షాక్‌ కొడుతుందేమోనని భయపడిపోయారు. చివరకు అతికష్టం మీద మరో వాహనం సాయంతో ఆ కారును నీటి నుంచి బయటకు తీసి చూడగా.. అప్పటికే ఏంజెలా చనిపోయారు. కాగా, ఈ ఘటన జరిగిన 24 నిమిషాల తర్వాత ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నట్టు సమాచారం తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా, ఏంజెలా అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీరు వెంచర్‌ క్యాపిటలిస్టు జిమ్‌ బ్రెయార్‌కు భార్య అని తెలిసింది . అయితే.. బ్లాంకో కౌంటీ షెరీఫ్ కార్యాలయం టెక్సాస్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్‌టన్‌కు రాసిన లేఖలో మాత్రం ఈ సంఘటన సాధారణ ప్రమాదం కాదు. అని పేర్కొంది. మరి, అతి చిన్న పొరపాటు కారణంగా ఆ మహిళ సీఈవో ప్రాణాలు కోల్పోయిన ఘటన పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి