iDreamPost

మీ రాజధాని మీ ఇష్టం – కేంద్ర హోమ్ మంత్రి

మీ రాజధాని మీ ఇష్టం – కేంద్ర హోమ్ మంత్రి

రాజదాని ఎక్కడ ఏర్పాటు చెయ్యాలనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, కాబట్టి రాష్ట్రంలో ఎక్కడైనా రాజధాని ఏర్పాటు చేసుకొనే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ స్ఫష్టం చేశారు. ఈరోజు లోక్ సభలో తెలుగుదేశం ఎంపి గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చిన ఆయన, రాజధాని అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించిన అంశం అని తెలిపారు.

పార్లమెంట్ లో సభాముఖంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి తమ వైఖరి వెల్లడించినప్పటికీ, అంతకుముందే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదే విషయం వెల్లడించారు. రాష్ట్ర రాజదాని అనేది రాష్ట్రాలకు సంబందించిన అంతర్గత వ్యవహారమని, సమాఖ్య స్పూర్తితో రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం కుదరదని కిషన్ రెడ్డి ఇదివరకే స్పష్టం చేశారు.

గత కొన్ని రోజులుగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రాజదాని అనేక మంది పెద్దఎత్తున ఆందోళనలు , ప్రధాన మంత్రి, రాష్ట్రపతి కి లేఖలు రాయడంతో పాటు పలువురు కేంద్ర ప్రముఖులను కలసి తమ వాదం వినిపించినప్పటికీ ఇంతవరకు రాజధాని అంశం పై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఈ నేపధ్యం లో పార్లమెంట్ సాక్షిగా తెలుగుదేశం ఎంపి గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమాధానమిస్తూ ఇప్పటివరకు అధికారికంగా అమరావతే రాజదాని గా ఉందని, మూడు రాజదానుల అంశం మీడియాలో వచ్చిన కధనాలు ద్వారా తమ దృష్టికి వచ్చిందని, అయితే దీనికి మద్దతు ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది కేంద్ర పరిధిలో లేని అంశమని తేల్చి చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఇచ్చిన ఈ సమాధానంతో రాజధాని అంశం లో ఇక కేంద్రం ఏమాత్రం కలగజేసుకోబోదని స్ఫష్టమైంది. లోక్ సభ వేదిక గానే అధికారిగా స్వయంగా కేంద్రమంత్రి నోటి ద్వారా ఈ ప్రకటన రావడంతో, ఇక ఈ అంశం పై ఎటువంటి కన్ఫ్యూజన్ లేదని అర్ధం అవుతుంది. దింతో మూడు రాజదానుల ఏర్పాటులో జగన్ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయిందని భావించవచ్చు. కేంద్ర మంత్రి చేసిన ఈ తాజా ప్రకటనతో రాజదాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతున్న వారికి ఇది ఊహించని షాక్ అని చెపొచ్చు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి