iDreamPost

కోళ్లఫారంపెట్టేందుకు అద్భుత స్కీమ్! రూ.50 లక్షలు రుణం!

కోళ్లఫారంపెట్టేందుకు అద్భుత స్కీమ్! రూ.50 లక్షలు రుణం!

నేటికాలంలో ప్రతి ఒక్కరు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ జీవితాన్ని క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ఉదయం ఆఫీసుకు వెళ్లడం.. సాయంత్రానికి ఇంటికి చేరాడం. ఇదే దినచర్యగా చాలా మంది జీవితాల్లో సాగుతుంది. అయితే ఇలా ఉద్యోగాలు చేస్తున్న వారిలో చాలా మంది అసంతృప్తిగా ఉంటున్నారు. తాము ఏదైన సొంత బిజినెస్ పెట్టుకుని, సొంత ఊరిలో హాయిగా ఉండాలని కోరుకుంటారు. అలా అనుకునే వారికి ఎన్నో వ్యాపారాలు  ఉన్నాయి. కొన్నిటికి ప్రభుత్వాలే ఆర్థిక సాయం చేస్తాయి. అలాంటి వాటిల్లో కోళ్ల ఫారం బిజినెస్ ఒకటి. అలా ఎవరైన గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల ప‌రిశ్ర‌మలు ఏర్పాటు చేయాలనుకుంటే.. వారికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం రాయితీపై రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణ స‌దుపాయం క‌ల్పిస్తోంది. మరి.. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నేటికాలం మాంసం తినే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా చికెన్ తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. మటన్ ధరలతో పోల్చితే తక్కువగా ఉండటంతో మాంస ప్రియులు చికెన్ వైపు మొగ్గు చూపుతుంటారు. ఇలా చికెన్ కి ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది. అందుకే కోళ్ల ఫారం పెట్టే వాళ్ల సంఖ్య కూడా బాగానే ఉంది. ఇంకా చాలా మంది కోళ్ల ఫారమ్ బిజినెస్ పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ వ్యాపారం గ్రామీణ ప్రాంతంలో చేసే వారికి కేంద్ర ప్రభుత్వం రుణ సాయం అందిస్తుంది.  50 శాతం సబ్సిడితో ఈ రూ.50 లక్షణల వరకు రుణం అందిస్తుంది.

కేంద్ర పశు సంవర్థక, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ.. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ స్కీమ్ కింద దేశంలో మాంసం, పాలు, గుడ్డు ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.  ఈ స్కీమ్ కి దరఖాస్తు చేసుకున్న వారికి 50 శాతం రాయితీతో రూ.50 లక్షల వరకు రుణమ ఇస్తారు. అంటే మీరు ఎంత ఏమౌంట్ తీసుకుంటే అందులో సగం చెల్లించాల్సి ఉంటుంది.  ఈ పథకం కింద ఎవరైనా రుణం పొందవచ్చు. వ్యక్తిగతంగా లేదా డ్వాక్రా గ్రూపులు, సెక్షన్-8 కింద వచ్చే కంపెనీలు.. ఇలా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రుణం విషయానికి వస్తే.. జాతీయ బ్యాంకులు ఏవైనా సరే ఈ పథకం కింద రుణాలను మంజూరు చేస్తాయి.

ఇక ఈ పథకం కింద ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్  అనే పోర్టల్ లోకి వెళ్లి.. దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రుణం కోసం డీటైల్డ్ ప్రాజెక్ట్ నివేదిక, ఆధార్ కార్డు, కోళ్ల ఫారం ఏర్పాటు చేయదలచుకున్న భూమి ఫోటో, భూమికి సంబంధించిన ప‌త్రాలు, పాన్ కార్డు,ఓట‌ర్ కార్డు, రుణం తీసుకోబోయే బ్యాంకులో మీ ఖాతాకు చెందిన రెండు క్యాన్సిల్డ్ చెక్కులు రుణం పొందాలంటే.. దరఖాస్తు దారుడి పేరిట కనీసం ఒక ఎకరం భూమి ఉండాలి. దరఖాస్తు చేసే సమయంలో ఆ భూమికి  సంబంధించిన  పత్రాలు జతపర్చాల్సి ఉంటుంది. సొంతంగా భూమిలేని పక్షంలో కౌలుకు తీసుకున్న ల్యాండ్ పై కూడా రుణం పొందవచ్చు.  అయితే భూమి యజమాని, మీరు కలిసి కలిసి జాయింటుగా రుణం తీసుకోవాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి