iDreamPost

కరోనా ఎఫెక్ట్ – ఎయిర్ లిఫ్ట్ 2.0 కి సిద్దమైన భారత్

కరోనా ఎఫెక్ట్ – ఎయిర్ లిఫ్ట్ 2.0 కి సిద్దమైన భారత్

1990లో, గల్ఫ్ యుద్ధ సమయంలో, సద్దాం హుస్సేన్ కువైట్ పై దండెత్తినప్పుడు, ఇరాకీలు కొన్ని గంటల్లో నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు, ఈ యుద్దంలో చిక్కుకున్న భారతీయుల కోసం భారత ప్రభుత్వం చరిత్రలోనే నిలిచిపోయే అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ యుద్దంలో చిక్కుకున్న 1,70,000 మంది భారతీయులను కేవలం 59 రోజుల్లో 488 విమానాల సహాయంతో కువైట్ నుండి విమానంలో తిరిగి స్వదేశానికి రప్పించింది. ఇప్పటి వరకు మానవజాతి చరిత్రలో ఆకాశ మార్గాన్న అతిపెద్ద తరలింపుగా ఈ ఘటన చరిత్ర ఎక్కింది.

ఇంతమందిని తరలించిన విమానయ సంస్థ అయిన ఎయిర్ ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లోకి కూడా ప్రవేశించింది. ఈ ఘటన ఆదారం చేసుకుని 2016లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కధానాయకుడిగా నటించిన ఎయిర్ లిఫ్ట్ అనే పేరుతో సినిమా కూడా ఒకటి విడుదలైంది.

అయితే 30 ఏళ్ళ క్రితం జరిగిన ఈ ఘటనని తలదన్నేలా ఇప్పుడు భారత ప్రభుత్వం తిరిగి మరోసారి అతి పెద్ద తరలింపును చేపట్టబోతోంది. మే 7 నుంచి మాల్దీవులు, గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నది. మొత్తం 60 కమర్షియల్ విమానాలు , మూడు భారత నేవీ నౌకల సహాయంతో మొత్తం 1,90,000 మందిని భారత దేశానికి తీసుకురాబోతున్నారు . ఆ తరువాత దశలవారిగా గల్ఫ్ లాంటి ఇతర దేశాల్లో చిక్కుకుని అవస్థలు పడుతున్న 8.5 మిలియన్ భారతీయులని స్వదేశానికి రప్పించబోతున్నారు. ఇతర దేశాలనుండి వచ్చిన వీరిని భారత్ లోకి అడుగుపెట్టగానే 14 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి