iDreamPost

కార్మికుల తరలింపు..రంగంలోకి రైల్వే..

కార్మికుల తరలింపు..రంగంలోకి రైల్వే..

లాక్ డౌన్ కారణంగా పనిప్రదేశాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు, కార్మికులను వారి వారి స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వారిని స్వస్థలాలకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం అవగాహన కి వచ్చిన తర్వాత వలస కూలీలు, కార్మికులను రోడ్డు మార్గాన తరలించాలని రెండు రోజుల క్రితం మార్గదర్శకాలు జారీ చేసింది.

అయితే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఆయా మార్గదర్శకాల్లో పలు మార్పులు చేసింది. సుదూర ప్రాంతంలో ఉన్న వలస కూలీలు కార్మికులు రోడ్డు మార్గాన తరలించడం కష్టసాధ్యమైన పని కావడంతో రైల్వే రంగంలోకి దించాలని నిర్ణయించింది. కార్మికులను వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేకంగా శ్రామిక రైళ్లను నడపాలని రైల్వేకు ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం మాట్లాడుకుని రైల్వేశాఖలో సంప్రదించాలని కేంద్రం సూచించింది. రైల్వే జోనల్ మేనేజర్లు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తారని వెల్లడించింది. ఈ మేరకు అన్ని జొనల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేయాలని రైల్వే శాఖ సూచించింది. కార్మికులు, కూలీలు వారి స్వస్థలాలకు చేరేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని స్పష్టం చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి