iDreamPost

పాపం జేసీ …చంద్రబాబు దగ్గర బావురుమన్న ఫైర్ బ్రాండ్

పాపం జేసీ …చంద్రబాబు దగ్గర బావురుమన్న ఫైర్ బ్రాండ్

సమైక్య ఆంధ్రప్రదేశ్ లో జేసీ దివాకర్ రెడ్డి గురించి తెలీనివాళ్ళు ఉండరు. కాంగ్రెస్ లో ఉన్నా టిడిపిలో ఉన్నా ఆయనది ప్రత్యేక స్టయిల్. ఏనాడూ అధిష్టానాన్ని గౌరవించిన దాఖలాలు లేవు. ఆయన ఆడిందే ఆట .పాడిందే పాట. టిడిపిలో ఉంటూ చంద్రబాబు మీద సెటైర్లు వేస్తారు.కాంగ్గ్రెస్ లో ఉంటూ సోనియా మీద పంచ్ లు వేస్తారు. అనంతపురంలో ఆయన చేసేదే వ్యాపారం..ఆడిగేవాళ్ళు లేరు. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు. గడ్డురోజులూ ఉంటాయి. సరిగ్గా అలాంటి టైమ్ ఆయనకు ఇప్పుడు మొదలైనట్లు ఉంది.

అందుకే ఆయన ఈ పరిస్థితులను తట్టుకోలేకపోతున్నట్లు ఉంది. అది నిజమేనా అన్నట్లుగా చంద్రబాబును జేసీ హత్తుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: శాంతా? అదెక్కడ JC గారూ ,

వాస్తవానికి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జేసీకి కష్టాలు మొదలయ్యాయి. ఆయనకు చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. ఆయనకు చెందిన వందలాది ఎకరాల సున్నపురాయి లీజును రద్దు చేశారు.తన ఆర్థిక మూలాలను నిర్మూలించేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారంటూ జేసీ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కక్ష సాధింపులకు దిగారంటూ దుయ్యబట్టారు.

ఈ పరిణామాల మధ్య జేసీ చంద్రబాబును కలుసుకుని హత్తుకున్న ఫోటో సోషల్ మీడియాలో చూసి అయ్యో దివాకర్ రెడ్డి పరిస్థితి ఇలా మారిందా అని అనుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి