iDreamPost

టిడిపి చిహ్నానికి చంద్రబాబుకు ఏమి సంబంధం ? ఎవరు డిజైన్ చేయించారో తెలుసా ?

టిడిపి చిహ్నానికి చంద్రబాబుకు ఏమి సంబంధం ?  ఎవరు డిజైన్ చేయించారో తెలుసా ?

తనదికానీ దాన్ని తనదని క్లైం చేసుకోవటం, ఇతరుల కష్టాన్ని తన సొంతానికి వాడుకోవటం చంద్రబాబునాయుడుకు బాగా అలవాటు. మే డే సందర్భంగా పార్టీ నేతలతో చంద్రబాబు వీడియా కాన్ఫరెన్సు నిర్వహించాడు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలే విచిత్రంగా ఉంది. చీమలు పెట్టిన పుట్టను పాము కబ్జా చేసినట్లు ఎన్టీయార్ స్ధాపించిన తెలుగుదేశంపార్టీని వెన్నుపోటు పొడిచి కబ్జా చేశాడు. ఎన్టీయార్ కష్టపడి 1994లో పార్టీని అధికారంలోకి తెస్తే దాన్ని చంద్రబాబు ఎలా సొంతం చేసేసుకున్నాడో అందరికీ తెలిసిందే.

అలాంటి చంద్రబాబు శ్రామికుల కష్టం, త్యాగాల గురించి సుదీర్ఘ ఉపన్యాసమే ఇచ్చాడు. పనిలో పనిగా తెలుగుదేశంపార్టీ జెండాలోనే కార్మికుల చక్రం, రైతన్న నాగలి, పేదోడి గుడెసె ఉన్నాయని చెప్పాడు. టిడిపి జెండా రంగు పసుపు శుభసూచకమన్నాడు. పైన చెప్పిన వాటితో దేనితోను చంద్రబాబుకు సంబంధం లేదు. చంద్రబాబు మాటలు ఎలాగున్నాయంటే పార్టీ చిహ్నం, జెండా రంగును తానే డిజైన్ చేయించినట్లు చెప్పుకున్నాడు. నిజానికి పార్టీ చిహ్నం, పార్టీ జెండా రంగు మొత్తం ఎన్టీయార్ కృషి ఫలితమే. పార్టీ పెట్టాలని నిర్ణయించగానే జెండాలో ఏమేమి అంశాలు కనబడాలనే విషయాన్ని ఎన్టీయార్ స్వయంగా నిర్ణయించుకున్నారని సీనియర్ నేత గంధమనేని రమేష్ చంద్రప్రసాద్ చెప్పారు.

జెండా రంగు, జెండాలో ఉండాల్సిన చిహ్నాలపై ఓ నిర్ణయానికి వచ్చిన ఎన్టీయార్ ఆదే విషయాన్ని 1981-82లో ప్రముఖ సినీ కళాదర్శకుడు తోటను పిలిపించి చర్చించినట్లు గంధమనేని చెప్పారు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాతే టిడిపి జెండాకు ఓ రూపం వచ్చిందని రమేష్ చంద్రప్రసాద్ తెలిపారు. పార్టీ జెండా డిజైన్ కు ఇంత చరిత్రుండగా చంద్రబాబు మాత్రం దాన్నే తానే తయారుచేయించినంత గట్టిగా టెలి కాన్ఫరెన్సులో చెప్పేయటమే విచిత్రంగా ఉంది.

సరే చంద్రబాబు మీడియా సమావేశమన్నా, టెలికాన్ఫరెన్సన్నా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటమే మెయిన్ అజెండాగా ఉంటుందన్న విషయం కొత్తగా ఎవరికీ చెప్పక్కర్లేదు. ఇపుడు కూడా తాము రూపొందించిన కార్మికచట్టం దేశంలోనే భేషయినది కాబట్టి జగన్ కూడా తమ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు రూపొందించిన కార్మికచట్టాన్ని ఏ రాష్ట్రం కూడా బ్రహ్మాండమని చెప్పలేదు. అయినా తాను చేసిన చట్టాలను వైసిపి ప్రభుత్వం అమలు చేయాలని చెప్పటం, తానిచ్చిన హామీలను జగన్ నెరవేర్చాలని డిమాండ్ చేయటం చంద్రబాబుకు మాత్రమే చెల్లింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి