iDreamPost

గీతం యూనివర్శిటీలో విద్యార్థి మృతి.. బాలకృష్ణ అల్లుడిపై కేసు నమోదు

ఉన్నత చదువుల కోసమని విద్యార్థులను లక్షలు ఖర్చు పెట్టి, మంచి విద్యా సంస్థల్లో జాయిన్ చేస్తున్నారు తల్లిదండ్రులు.. కానీ చివరకు చదువు ఒత్తిడి, కాలేజీ యాజమాన్యం నిర్వాకం కారణంగా..

ఉన్నత చదువుల కోసమని విద్యార్థులను లక్షలు ఖర్చు పెట్టి, మంచి విద్యా సంస్థల్లో జాయిన్ చేస్తున్నారు తల్లిదండ్రులు.. కానీ చివరకు చదువు ఒత్తిడి, కాలేజీ యాజమాన్యం నిర్వాకం కారణంగా..

గీతం యూనివర్శిటీలో విద్యార్థి మృతి.. బాలకృష్ణ అల్లుడిపై కేసు నమోదు

భవిష్యత్ బాగుండాలని పిల్లల్ని ఉన్నత చదువుల కోసం దూర భారాలు పంపిస్తున్నారు తల్లిదండ్రులు. కానీ అక్కడకు వెళ్లాక..చదువుల ఒత్తిడి, హోం సిక్ కారణంగా మానసికంగా వీక్ అయిపోతున్నారు. చదువుకోవడం ఇష్టలేకపోవడం, తల్లిదండ్రుల బలవంతం మీద స్టడీస్ రన్ చేస్తున్న పిల్లలు చాలా మందే ఉన్నారు. మరికొంత మంది ఇష్టంతోనే ఇతర రాష్ట్రాలకు వెళుతున్నప్పటికీ.. అక్కడ మనుషులు, వాతావరణానికి ఇమడలేక, తమకు తాము సర్ధిచెప్పుకోలేక, తల్లిదండ్రులకు బాధను వెళ్లగక్కలేకపోతున్నారు. దీంతో చావే శరణ్యమని ఆశ్రయిస్తున్నారు. తాజాగా బెంగళూరులోని గీతం యూనివర్శిటీలో ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు.

బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డ బల్లాపూర్ తాలూకాలోని నాగదేన హళ్లి సమీపంలోని గీతం యూనివర్శిటీలో మార్చి 12న ఓ విద్యార్థి మృతి చెందాడు. అతడు ఆంధ్రప్రదేశ్ వాసి అని తెలుస్తోంది. కర్నూల్ జిల్లాకు చెందిన దాసరి బ్రహ్మ సాయి రెడ్డి.. గీతం యూనివర్శిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం రాత్రి భోజనం చేసి మేడపైకి వెళ్లిన అతడు.. అనూహ్యంగా కింద పడి చనిపోయాడు. అయితే ఇది ఆత్మహత్య లేక ఇతర కారణాలేమిటో తెలియరాలేదు. కాగా, యూనివర్శిటీ యాజమన్యం నిర్లక్ష్యం వల్లే తన కొడుకు చనిపోయాడంటూ మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  ఆరో అంతస్థులో కన్ స్ట్రక్షన్ జరుగుతుందని, గోడలు సరిగా నిర్మించకపోడంతో పాటు అక్కడ సెక్యూరిటీ  కూడా సరిగా ఏర్పాటు చేయలేదని, దీంతో తన కొడుకు చనిపోయాడంటూ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దొడ్డబళ్లాపూర్ రూరల్ పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

గీతం యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్, ప్రెసిడెంట్ శ్రీ భరత్ (బాలకృష్ణ అల్లుడు), కాంట్రాక్టర్ విజయ్ భాస్కర్, సెక్యూరిటీ ఇన్ చార్జ్ విజయ్, వార్డెన్ ఇంచార్జులపై ఐపీసీ 304 కింద కేసు నమోదు చేశారు. కాగా, యూనివర్శిటీలో విద్యార్థులు మరణించడం ఇప్పుడేమీ కొత్తకాదూ.. గత నాలుగు నెలల్లో ముగ్గురు విద్యార్థులు మరణించారు. గత నవంబర్‌లో ఓ విదేశీ విద్యార్థిని ఉరి వేసుకుని మరణించింది. ఫిబ్రవరి 6న మరో విద్యార్థి రైలు ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తోంది. తాజాగా ఆంధ్రాకు చెందిన విద్యార్థి.. హాస్టల్ పై నుండి దూకి చనిపోవడం చేసుకున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు వరుస మరణాలతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. వేధింపులు, మాదక ద్రవ్యాల ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి