iDreamPost

కార్లలో వెళ్తున్నారా? అయితే మీ లైంగిక కార్యకలాపాల డేటా లీక్ అవుద్ది జాగ్రత్త!

  • Author singhj Updated - 06:39 PM, Tue - 2 January 24

మనం ప్రయాణించే వాహనాల్లోనూ వీటి వాడకం పెరిగింది. క్రమంగా వెహికిల్స్ అన్నీ డిజిటల్​మయంగా మారుతున్నాయి. ఈ తరుణంలో డేటా ప్రైవసీ పై ఒక సంస్థ ఆందోళనకర విషయాలను వెల్లడించింది. వరల్డ్ వైడ్​గా ప్రముఖ బ్రాండ్ల కార్లలో యూజర్ల గోప్యత ఒక కలగానే మారిందని పేర్కొంది.

ఈ రోజుల్లో అధునాతన టెక్నాలజీ వాడకం బాగా పెరిగింది. రోజువారీ పనుల్లో భాగంగా వాడే చాలా వస్తువుల్లోకి టెక్నాలజీ వచ్చేసింది. మనం ప్రయాణించే వాహనాల్లోనూ వీటి వాడకం పెరిగింది. క్రమంగా వెహికిల్స్ అన్నీ డిజిటల్​మయంగా మారుతున్నాయి. ఈ తరుణంలో డేటా ప్రైవసీ పై ఒక సంస్థ ఆందోళనకర విషయాలను వెల్లడించింది. వరల్డ్ వైడ్​గా ప్రముఖ బ్రాండ్ల కార్లలో యూజర్ల గోప్యత ఒక కలగానే మారిందని పేర్కొంది. యూఎస్​లోని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న మొజిల్లా ఫౌండేషన్ 25 ప్రముఖ కార్ల బ్రాండ్లను అధ్యయనం చేసింది.

యూజర్ల ప్రైవసీ విషయంలో ఏ ఒక్క కంపెనీ కూడా సంతృప్తికరమైన ప్రమాణాలు పాటించడం లేదని మొజిల్లా ఫౌండేషన్ స్పష్టం చేసింది. ‘ఇంటర్నెట్​కు కనెక్ట్ అయ్యే గ్యాడ్జెట్లు మాత్రమే మన మీద నిఘా వేసి ఉంచుతున్నాయని ఇప్పటిదాకా అనుకుంటూ వచ్చాం. కానీ, పాపులర్ కార్ల బ్రాండ్లన్నీ నెమ్మదిగా ఇన్​ఫర్మేషన్​ను సేకరించే మెషీన్లుగా మారి డేటా విక్రయ బిజినెస్​లోకి ప్రవేశించాయి’ అని మొజిల్లా తెలిపింది. వినియోగదారుల డేటాపై నిఘా వేసి దాన్ని సేకరించడంలో అమెరికన్ కార్ల దిగ్గజం టెస్లా అందరికంటే ముందుందని ఆరోపించింది.

యూజర్ల లైంగిక కార్యకలాపాలు సహా అత్యంత సున్నితమైన సమాచారాన్ని కూడా ఒక కంపెనీ సేకరించే ప్రయత్నం చేసినట్లుగా తాము గుర్తించామని మొజిల్లా వెల్లడించింది. అలాగే 84 శాతం కార్ బ్రాండ్​లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సర్వీస్ ప్రొవైడర్లు, డేటా బ్రోకర్లు సహా ఇతర వ్యాపారులతో పంచుకునేందుకు అంగీకరించాయని మొజిల్లా సర్వే వెల్లడించింది. ఇందులో 76 శాతం ఇప్పటికే యూజర్ల డేటాను అమ్మేశాయని తెలిపింది. మరికొన్ని కంపెనీలు గవర్నమెంట్, దర్యాప్తు సంస్థలకు అవసరమైతేనే సమాచారాన్ని అందిస్తామని తెలిపినట్లు పేర్కొంది. డ్రైవింగ్​కు సంబంధించిన సమాచారంతో పాటు కారులోని ఎంటర్​టైన్​మెంట్ సిస్టమ్, శాటిలైట్ రేడియో, మ్యాప్స్ లాంటి వాటి నుంచి కార్లు సమాచారాన్ని సేకరిస్తున్నాయని వివరించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి