iDreamPost

మొదలైన ఫిరాయింపులు.. BRS నుంచి గెలిచిన అభ్యర్థి కాంగ్రెస్‌లోకి!

తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో ఓటర్లు భిన్నమైన తీర్పునిచ్చినట్లు ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి స్పష్టమౌతోంది. పలు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థుల కన్నా కాంగ్రెస్ క్యాండిడేట్స్ విజయ కేతనం సాధించారు. ఈక్రమంలోనే ఫిరాయింపులు మొదలయ్యాయి.

తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో ఓటర్లు భిన్నమైన తీర్పునిచ్చినట్లు ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి స్పష్టమౌతోంది. పలు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థుల కన్నా కాంగ్రెస్ క్యాండిడేట్స్ విజయ కేతనం సాధించారు. ఈక్రమంలోనే ఫిరాయింపులు మొదలయ్యాయి.

మొదలైన ఫిరాయింపులు.. BRS నుంచి గెలిచిన అభ్యర్థి కాంగ్రెస్‌లోకి!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ పథం వైపు దూసుకెళుతోంది. అనేేక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు చేరువైంది. అయితే ఫలితాలు పూర్తి స్థాయిలో వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం.. పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనకు తెలంగాణ ఓటర్లు హ్యాండ్ ఇచ్చినట్లు కనబడుతోంది. బీఆర్ఎస్ కీలక నేతలు పలు నియోజకవర్గాల్లో ఓటమి చెందారు. నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి వంటి ముఖ్య నేతలు ఓడిపోయారు. అయితే ఇలా ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు.. అప్పుడే ఫిరాయింపులు మొదలయ్యాయి. జంపింగ్ విధానానికి తెరలేపాడు గెలిచిన అభ్యర్థి.

భద్రాచలం నియోజకవర్గం నుండి పోటీ చేసిన తెల్లం వెంకట్రావు విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య మీద జయ కేతనం ఎగుర వేశారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్‌లోకి చేరుతున్నట్లు సమాచారం. నియోజకవర్గం అభివృద్ధి కోసం ఈ నెల 8వ తేదీన హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఫలితాలు ఇంకా తేలనే లేదు.. అప్పుడే మరో పార్టీలోకి జంప్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే  తెల్లం వెంకట్రావ్ తొలి నుండి పొంగులేటి అనుచరుడగా ఉండటం, కాంగ్రెస్ లో సిట్టింగ్ అభ్యర్థి పొదెం వీరయ్యకు సీటు కేటాయించడంతో.. అప్పుడు మౌనం వహించి, గెలిచాక.. ఇప్పుడు హస్తం పార్టీకి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి